Jayalalithaa: జయలలిత కేసులో మళ్లీ ?, టైమ్ కావాలి సార్, ట్విస్ట్ లు, సీబీసీఐడీ ఎంట్రీ !
కొడనాడు ఎస్టేట్ లో జయలలిత ప్రత్యేకంగా ఓ బంగ్లా కట్టుకున్న విషయం తెలిసిందే. జయలలిత మరణించిన తరువాత కొడనాడు ఎస్టేట్ లోని ఆమె బంగ్లాలో చోరీ జరగడం.సెక్యూరిటీ గార్డు హత్యకు గురికావడం కలకలం రేపింది. ఇప్పుడు ఈ కేసు విచారణ వాయి
చెన్నై/కొడనాడు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెన్నైలోని పోయస్ గార్డెన్ ఎంత ఇష్టమో తమిళనాడులోని నిలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్ కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం. ప్రతిపక్షంలో ఉన్నా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే జయలలిత చాలాసార్లు కొడనాడు ఎస్టేట్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకునేవారు. కొడనాడు ఎస్టేట్ లో జయలలిత ప్రత్యేకంగా ఓ బంగ్లా కట్టుకున్న విషయం తెలిసిందే. జయలలిత మరణించిన తరువాత కొడనాడు ఎస్టేట్ లోని ఆమె బంగ్లాలో చోరీ జరగడం. తరువాత అక్కడి సెక్యూరిటీ గార్డు హత్యకు గురికావడం కలకలం రేపింది. ఇప్పుడు ఈ కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.

జయలలిత అండ్ కో
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు వీకే శశికళ నటరాజన్, చిన్నమ్మ సమీప బంధువు ఇళవరసి, సుధాకరన్ తదితరులకు నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్ ఉంది. దాదాపు 800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా సందర్శించేశారు. జయలలిత బస చేసేందుకు కొడనాడులో చాలా విలాసవంతమైన బంగ్లా కూడా నిర్మించారు.

అమ్మ చనిపోయిన తరువాత ?
చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత చనిపోయారు. జయలలిత చనిపోయిన తరువాత ఆమె ఆస్తుల విషయంలో చాలా గొడవలు. రాద్దాంతాలు జరిగాయి. 2017 ఏప్రిల్ 24న కొడనాడు ఎస్టేట్ లోని జయలలిత బంగాల్లోలో దోపిడీ ఘటన జరిగింది. ఆ తరువాత నైట్ వాచ్‌మెన్ ఓంబహదూర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య, దోపిడీ ఘటనలో జయలలిత మాజీ కారు డ్రైవర్ కనగరాజ్, కేరళకు చెందిన సయన్, వలయారు మనోజ్ సహా 11 మంది పాల్గొన్నారని వెలుగు చూసింది.

ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు
తరువాత సేలం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడనాడు ఎస్టేట్ కేసులోని ప్రధాన నిందితుడు కనగరాజ్ మృతి చెందాడు. దీని తరువాత సయాన్‌తో సహా 10 మందిని నేరస్థులుగా చేర్చారు. కొడనాడు ఎస్టేట్ కేసులోని నిందితులు అందరూ బెయిల్ మీద బయట ఉన్నారు. జిల్లా సెషన్స్ కోర్టులో గత 5 సంవత్సరాలుగా కేసు విచారణ నడుస్తోంది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీ పోలీసులకు అప్పగించగా, ఈరోజు విచారణకు వచ్చింది.

సమయం కావాలని మనవి....... కేసు విచారణ వాయిదా
న్యాయవాదులు సాజాఖాన్, కనగరాజ్ కేసు విచారకు హాజరైనారు. నిందితులను విచారణ చేస్తున్న సీబీసీఐడీ పోలీసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మురుగవేల్, డీఎస్పీలు చంద్రశేఖర్, అన్నాదురై, నిందితులు సయాన్, దీపు, వలయారు మనోజ్, సతీశన్, సంతోష్స్వామి, జీతిన్ జాయ్ తదితరులు హాజరయ్యారు. ఈ కేసులో కేసు దర్యాప్తు సందర్భంగా హత్య, దోపిడీ సంఘటన జరిగినప్పుడు కేసు విచారణ చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్ మురళీతో సహ 48 మందిని సీబీసీఐడీ పోలీసులు ఇప్పటివరకు విచారించారు. పూర్తి సమాచారం కోర్టుకు చెప్పడానికి కొంత సమయం కావాలని సీబీసీఐడీ అధికారులు మనవి చెయ్యడంతో జిల్లా జడ్జి మురుగన్ కేసు విచారణను ఇదే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేశారు. మొత్తం మీద జయలలిత కొడనాడు ఎస్టేట్ కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోందని అమ్మ అభిమానులు అంటున్నారు.












Click it and Unblock the Notifications