హిమాచల్ బీజేపీలో ఆడియో క్లిప్స్ చిచ్చు-సీఎంకు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగానే రెబెల్స్ ?
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీలో వర్గపోరుకు కేంద్రంగా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పూర్తయిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ రెండుగా చీలిపోయింది. సీఎం జైరాం ఠాకూర్ అనుకూల,వ్యతిరేక వర్గాలుగా మారిన బీజేపీ నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా పలుచోట్ల రెబెల్స్ ను ఉద్దేశపూర్వకంగా నిలబెట్టినట్లు ఆడియో క్లిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం బీజేపీని చిక్కుల్లోకి నెడుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్ది జైరాం ఠాకూర్ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ పోటీ చేశారు. వీరంతా పార్టీ మద్దతుదారులేనని భావిస్తుండగా.. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్స్ లో వీరిని ఆయన ప్రత్యర్ధులు ఉద్దేశపూర్వకంగానే నిలబెట్టినట్లు తేలింది. దీంతో బీజేపీ అధిష్టానం కూడా చిక్కుల్లో పడింది. హిమాచల్ లో అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇది తలనొప్పిగా మారింది. ఎన్నికలు సజావుగా ముగిశాయని భావిస్తున్న సమయంలో బీజేపీలో వర్గపోరు బయటపడటంతో ఇది ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఆందోళన కాషాయ శిబిరంలో వ్యక్తమవుతోంది.

చంబాలోని డల్హౌసీ, మండీజిల్లాలోని జోగీందర్ నగర్ సీట్లలో బీజేపీ సీట్లు దక్కనివారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఈ ఆడియో క్లిప్ లు స్పష్టంచేస్తున్నాయి. కంగ్రా జిల్లాలో కంగ్రా సీటులోనూ ఇదే పరిస్ధితి. అదే సమయంలో కంగ్రా జిల్లాలో గెలిచిన వారే రాష్ట్రంలో అధికారం చేపట్టే సంప్రదాయం కూడా ఉండటంతో బీజేపీ ఆందోళన మరింత పెరుగుతోంది.












Click it and Unblock the Notifications