బెంగళూరు సిటీలో చిరుత ప్రత్యక్షం, ఎలా వచ్చింది ?, ఎక్కడికి వెళ్లింది, సీసీటీవీల్లో !
బెంగళూరు: బెంగళూరు నగరానికి చిరుతపులికి మధ్య అవినాభావ బంధం ఉందని మరోసారి వెలుగు చూసింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ప్రాంతాల్లో చిరుతలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా చిరుతపులి సంచారం గణనీయంగా తగ్గింది. అప్పుడు హఠాత్తుగా నివాస ప్రాంతంలోకి పరుగెత్తి వచ్చిన చిరుత బెంగుళూరు ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.
బెంగుళూరు సిటీ రానురాను విస్తరిస్తున్న కొద్దీ అటవి ప్రాంతం నాశనమైపోతోంది. ముఖ్యంగా బెంగుళూరు మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు గత 20 ఏళ్లలో బెంగళూరు శివార్లలోని అడవులు ధ్వంసమయ్యాయి. దీంతో అడవి జంతువులు నగరానికి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం అపార్ట్‌మెంట్‌లోకి చిరుతపులి చొరబడింది.

అంతకు ముందు రాత్రి పూట స్కూల్‌లోకి వెళ్లిన చిరుతపులిని చూసి స్థానికులు హడలిపోయారు. బెంగళూరులోని ఓ పాఠశాలలోకి చిరుతపులి చొరబడిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. ఇప్పుడు బెంగుళూరులో మార్గమధ్యంలో ఈ చిరుత కనిపించింది. సిలికాన్ సిటీ బెంగుళూరులో చిరుతపులి కనిపించడంతో బెంగళూరు వాసులకు ఉలిక్కిపడ్డారు.
బెంగళూరు నగరంలోని నివాస ప్రాంతంలో కనిపించిన చిరుతపులి మార్గమధ్యలో హాయిగా, దర్జాగా నడుచుకుంటూ వెళ్లిందది. బెంగళూరు-హోసూర్ రోడ్డులోని కుడ్లుగేట్ సమీపంలో రాత్రి చిరుతపులి కనిపించింది. కుడ్లు గేట్ లోని హోస్సళపాల్య సమీపంలో చిరుతపులి కనిపించింది. చిరుతలు రాత్రిపూట వేగంగా తిరుగుతూ ఆ సమయంలో ఆహారం కోసం వెతుకుతాయి.

రాత్రిపూట చిరుతలను ఇబ్బంది పెట్టేవారు ఎవరూ ఉండరు. అలాగే నగరం పరిసర ప్రాంతాల్లో కుక్కలతో సహా ఇతర పెంపుడు జంతువులపై చిరుతలు దాడికి పాల్పడుతుంటాయి. అదేవిధంగా హోసూరు రోడ్డులోని కూడ్లు గేటు సమీపంలో చిరుతపులి కనిపించింది. కుడ్లు గేట్ సమీపంలోన హోస్సళ్యపాల్య సమీపంలో చిరుతపులి కనిపించడంతో కుక్కలు చిరుతను వెంబడించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మొత్తం మీద చిరుతపులి ప్రత్యక్షం కావడంతో బెంగళూరు వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో బయటికి వెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్పుడు చిరుతపులి కనిపించిన ప్రదేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు మరియు. చిరుత పులి కనిపించిన ప్రాంతాల్లో అటవి శాఖ అధికారులు, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థారనిక డిమాండ్ చేస్తున్నారు. అయితే కి చిరుతపులి ఎటువైపు నుంచి వచ్చింది ? ఎక్కడికి పారిపోయింది అనే విషయంపై అటవి శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications