మోడీ మనసులో మాట: కార్గిల్ వీర సైనికులకు వందనం, అథ్లెట్లకు బెస్ట్ విషెస్
టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాభివందనాలు తెలిపారు. నిన్న 49 కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ పీవీ సింధు కూడా శుభారంభం చేశారు. దీంతో మోడీ వారిని విష్ చేశారు. అలాగే కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు. మన్ కీ బాత్‌లో భాగంగా ఇవాళ ఆల్ ఇండియా రేడియాలో మాట్లాడారు.

వీరే ఆదర్శం..
ఏదైనా నేర్చుకోవడం అంటే ఆ విభాగంలో ఉన్నత స్థానానికి వెళ్లడమే అని మోడీ అన్నారు. వ్యవసాయ రంగంలో మణిపూర్, త్రిపుర సాధిస్తోన్న ప్రగతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇటీవల మణిపూర్‌లో ఆపిల్ సాగు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లి శిక్షణ పొందుతున్నారని తెలిపారు. రింగ్ ఫమి యంగ్ శిక్షణ తీసుకుంటున్నారని మోడీ గుర్తుచేశారు. కరోనా తర్వాత పరిస్థితులు మళ్లీ మారుతున్నాయని వివరించారు. త్రిపురకు చెందిన బిక్రమ్ జీత్ చక్మా బెర్ పండ్ల సాగు చేసి.. మంచి లాభాలను గడించారని తెలిపారు.
Recommended Video

టీకా తీసుకోవాల్సిందే..
అలాగే చండీఘడ్‌లో సంజయ్ రాణా గురించి ప్రస్తావించారు. ఆయన చోలే భటూరే చేస్తున్నారని తెలిపారు. అదీ ఉచితంగా కావాలని అంటే టీకా తీసుకోవాలని.. దానికి సంబంధించి మేసెజ్ చూపించాలని కోరారు. ఒడిశాకు చెందిన ఇసాక్ ముండా రోజువారీ కూలీ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యారని తెలిపారు. ఒడిశా సంప్రదాయక వంట చేసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారని తెలిపారు. అలా మంచి సంపాదనను ఆర్జిస్తున్నారని పేర్కొన్నారు.

జలమే జీవజాలం.. నీరు పొదుపు చేయండి
ఇవాళ్టి మన్ కీ బాత్‌లో నీటి పొదుపు గురించి మోడీ ప్రస్తావించారు. జలమే జీవ జాలం అని పేర్కొన్నారు. తన బాల్యంలో నీటి ఎద్దడిని ఎదుర్కొన్నానని మోడీ తెలిపారు. నీటి ఆదా మన దైనందిన జీవితంలో భాగం కావాలని కోరారు. ఇందులో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. కుటుంబం, గ్రామాలు అంతా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. దేశంలో మన్ కీ బాత్‌కు ఎక్కువ స్పందన వస్తుందని తెలిపారు. యువతే ఎక్కువ ఫాలొ కావడం సంతోషంగా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications