చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ కు రెండేళ్లు జైలు శిక్ష, ప్రభుత్వానికి పంగనామాలు, చీటింగ్ !

వీకే శశికళ భర్త నటరాజన్ కు రెండేళ్లు జైలు శిక్షచిన్నమ్మ ఫ్యామిలీకి షాక్ మీద షాక్, ప్రభుత్వానికి పంగనామాలుప్రత్యేక కోర్టు తీర్పు అమలు చెయ్యండి, హై కోర్టులో మన్నార్ గుడి మాఫియాకు చుక్కెదురు

చెన్నై: శశికళ కుటుంబ సభ్యులకు షాక్ మీద షాక్ తగులుతోంది. వరుసగా మన్నార్ గుడి మాఫియా కుటుంబ సభ్యులు జైలు జీవితం గడపడానికి సిద్దం అవుతున్నారు. జయలలిత ప్రాణస్నేహితురాలిగా ఉన్న శశికళ కుటుంబ సభ్యులకు కోలుకోలేని దెబ్బపడింది.

Recommended Video

    శశికళ పెరోల్ పై వచ్చి ఏం చేసిందో తెలుసా ? | Oneindia Telugu

    శశికళ భర్త నటరాజన్ కు రెండేళ్లు జైలు శిక్ష విధించిన కింది కోర్టు తీర్పును మద్రాసు హైకోర్టు సమర్థించింది. నటరాజన్ కు రెండేళ్లు జైలు గ్యారెంటీ అంటూ మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి జి. జయచంద్రన్ చెప్పడంతో మాన్నార్ గుడి మాఫియా షాక్ కు గురైయ్యింది.

    ప్రభుత్వాన్ని చీట్ చేశారు

    ప్రభుత్వాన్ని చీట్ చేశారు


    1994లో శశికళ భర్త నటరాజన్ విదేశాల నుంచి టయోటా కంపెనీకి చెందిన విలాసవంతమైన కారు (Lexus)దిగుమితి చేసుకున్నారు. తరువాత పన్ను ఎగవెయ్యడానికి నటరాజన్ భారీ ప్లాన్ వేశారు. తాను విదేశాల నుంచి షోరూం కారు తెప్పించలేదని, సెకండ్ హ్యాండ్ కారు తెప్పించానని అధికారులను నమ్మించారు.

    సీబీఐ. ఈడీ కేసులు !

    సీబీఐ. ఈడీ కేసులు !

    సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి నటరాజన్ కు చెందిన టయోటా కారు వివరాలు సేకరించారు. నటరాజన్ తో పాటు ఆయన సమీప బంధువు ఆర్ బీఐ భాస్కరన్, యోగేష్ బాలక్రిష్ణ్రన్, ఎస్. సుందర్ రాజన్ మీద కేసు నమోదు చేశారు.

    ప్రభుత్వానికి పంగనామాలు

    ప్రభుత్వానికి పంగనామాలు


    సీబీఐ అధికారులు నటరాజన్ కారును షోరూంలో కొనుగోలు చేశారని ఒరిజనల్ సేల్ వాయిస్ తో పాటు ఒక ఫోటో, ఇన్ వాయిస్ సేకరించి కోర్టులో సమర్పించారు. నటరాజన్ తదిరుతరులు కారు ఇంజన్, చాసీ నెంబర్ మార్చి వేసి మోసం చెయ్యాలని ప్రయత్నించారని, అందు వలన ప్రభుత్వానికి రూ. 1.06 కోట్ల నష్టం వచ్చిందని కోర్టులో వాదించారు.

    2010లో జైలు శిక్ష

    2010లో జైలు శిక్ష

    2010లో కేసు విచారణ పూర్తి చేసిన ప్రత్యేక న్యాయస్థానం నటరాజన్, భాస్కరన్, యోగేష్ బాలక్రిష్ణ్రన్, ఎస్. సుందర్ రాజన్ ప్రభుత్వాన్ని మోసం చేశారని, చీటింగ్ చేసి అధికారులను వంచించారని ఆధారాలు ఉన్నాయని, నేరం రుజువు అయ్యిందని ప్రత్యేక కోర్టు అందరికీ రెండేళ్లు జైలు శిక్ష విధించింది.

    హైకోర్టులో ఎదురు దెబ్బ

    హైకోర్టులో ఎదురు దెబ్బ

    ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ నటరాజన్ తదితరులు మద్రాసు హై కోర్టును ఆశ్రయించారు. మద్రాసు హై కోర్టు ప్రత్యేక కోర్టు ఆదేశాలను నిలిపివేసి విచారణ చేపట్టింది. శుక్రవారం కేసు విచారణ చేసిన మద్రాసు హై కోర్టు నటరాజన్ తదితరులు నేరం చేశారని పూర్తి సాక్షాధారాలు ఉన్నాయని, కింది కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని నటరాజన్ తదితరులు వేసిన పిటిషన్ కొట్టివేసింది. నటరాజన్ కు రెండేళ్లు జైలు శిక్ష అమలు చెయ్యాలని మద్రాసు హై కోర్టు స్పష్టం చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+