ఆరు రోజుల్లో జన్మదినం: కపిల్ కుందు స్ఫూర్తి ఇదీ
న్యూఢిల్లీ: ఆదివారం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మరణించిన కెప్టెన్ కపిల్ కుందు తన 23వ జన్మదిన వేడుకలకు ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండింది. కపిల్ కుందు స్ఫూర్తి గురించి చెప్పాలంటే, ఆయన ఫేస్‌బుక్ అనంతంగా వివరిస్తుంది.
జీవితం సుదీర్ఘంగా ఉండడం కన్నా ఉన్నతంగా ఉండాలనేది కపిల్ కుందు స్ఫూర్తి. అది ఆనంద్ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో రాజేశ్ ఖన్నా చెప్పిన డైలాగ్. కపిల్ కుందు మరో ముగ్గురు జవాన్లతో పాటు ఆదివారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీరులోని రాజౌరి జిల్లాలో అమరుడైన విషయం తెలిసిందే.

పాకిస్తాన్ ఆర్మి ఐదారు క్షిపణులను పేల్చింది. అందులో ఒకటి భారత సైన్యం ఉన్న బంకర్‌ను తాకింది. తనకు మరో కుమారుడు ఉంటే అతన్ని కూడా సైన్యంలోకి పంపి ఉండేదాన్నని, తన కుమారుడు మరో 15, 20 ఏళ్లు జీవించి ఉంటే దేశానికి ఇంకా ఎంతో చేసి ఉండేవాడని కపిల్ కుందు తల్లి సునీత కుందు అన్నారు.
హర్యానాలోని తన సొంత పట్టణం పటౌడీకి వెళ్లడానికి కుందు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన తల్లి సునీత, అక్కాచెల్లెళ్లతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవాలని అనుకున్నారు.












Click it and Unblock the Notifications