మళ్ళీ లాక్‌డౌన్? కేంద్రం సంచలన ప్రకటన

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ.. సోషల్ మీడియాలో ఒకటే గుసగుస.. భారత్ మరోసారి గడప దాటని రోజుల్లోకి వెళ్లనుందా? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశంలో మళ్ళీ 'లాక్‌డౌన్' విధించబోతున్నారా? అనే ప్రశ్నలు కోట్లాది మంది భారతీయులను కలవరపెట్టాయి.

యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించడం, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతో జనంలో మొదలైన ఈ భయాందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మౌనం వీడింది. లాక్‌డౌన్ ఊహాగానాలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి శుక్రవారం (మార్చి 27, 2026) నాడు అత్యంత కీలక ప్రకటన చేశారు.

Lockdown in India 2026 Minister Hardeep Singh Puri Slams Rumors Amid Israel-Iran War Crisis

దేశంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించిన మంత్రి, "దేశంలో లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం ముందు లేదు" అని తేల్చి చెప్పారు. బాధ్యతారాహిత్యంగా ఇలాంటి హానికరమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దని ఆయన హెచ్చరించారు.

యుద్ధం ముదిరినా.. మన దగ్గర 'చమురు' పుష్కలం!..

ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూసివేత భయాలు ఉన్నప్పటికీ, భారత్ భయపడాల్సిన పని లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే ప్రచారంలో నిజం లేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌కు 41 కంటే ఎక్కువ దేశాల నుండి ముడి చమురు అందుతోందని, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుండి సరఫరా పెరగడం వల్ల ఏవైనా అంతరాయాలు ఉన్నా వాటిని సమర్థవంతంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. భారత్ వద్ద రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

ప్రధాని మోదీ నిరంతర పర్యవేక్షణ..

ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని మంత్రి పూరి పేర్కొన్నారు. "నిత్యావసర వస్తువులు, ఇంధనం మరియు శక్తి వనరుల సరఫరాలో మన పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది" అని ఆయన హామీ ఇచ్చారు.

అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య కూడా భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంటుందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ఊపిరి బిగబట్టిన సామాన్యులకు ఈ ప్రకటన పెద్ద ఊరటనిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+