దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పండగ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా తొలి దశ ఎన్నికల్లో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఏపీ, తెలంగాణ సహా అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రత కట్టుదిట్టం చేసింది ఎన్నికల సంఘం. 20 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ స్థానాలకు తొలిదశలో పోలింగ్ జరగనుంది. ఏపీతో పాటుగా ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ అందిస్తుంది వన్ ఇండియా తెలుగు.
Apr 11, 2019, 8:52 pm IST
న్యూఢిల్లీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో 6, 5 అరుణాచల్ ప్రదేశ్, బీహార్‌లో ఒకటి, మణిపూర్‌లో రెండు, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి చొప్పున ఈవీఎంలు ధ్వంసానికి గురయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
Apr 11, 2019, 8:49 pm IST
పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్ 2 సీట్లకు సంబంధించి 81 శాతం పోలింగ్ నమోదైంది
Apr 11, 2019, 8:49 pm IST
అసోం
అసోం 5 సీట్లకు సంబంధించి 68 శాతం పోలింగ్ నమోదైంది
Apr 11, 2019, 8:48 pm IST
త్రిపుర
త్రిపుర ఒక్క స్థానానికి జరిగిన పోలింగ్‌కు సంబంధించి 81.8 శాతం ఓటింగ్ నమోదైంది
Apr 11, 2019, 8:47 pm IST
మణిపూర్
మణిపూర్ ఒక్క స్థానానికి జరిగిన పోలింగ్‌కు 78.2 శాతం ఓటింగ్ నమోదైంది.
Apr 11, 2019, 8:46 pm IST
నాగాలాండ్
నాగాలాండ్ ఒక్క స్థానానికి 78 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
Apr 11, 2019, 8:46 pm IST
మిజోరం
మిజోరం ఒక్క స్థానంలో 60 శాతం పోలింగ్ రికార్డైంది
Apr 11, 2019, 8:45 pm IST
సిక్కిం
సిక్కింలో ఒక స్థానానికి 69 శాతం ఓటింగ్ జరిగింది
Apr 11, 2019, 8:45 pm IST
ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ 8 సీట్లకు 63.69 శాతం పోలింగ్ జరిగింది
Apr 11, 2019, 8:44 pm IST
ఒడిశా
ఒడిశా 4 స్థానాలకు 68 శాతం పోలింగ్ జరిగింది
Apr 11, 2019, 8:43 pm IST
మేఘాలయ
మేఘాలయ 2 సీట్లకు 67.16 శాతం పోలింగ్ నమోదైంది
Apr 11, 2019, 8:43 pm IST
మహారాష్ట్ర
మహారాష్ట్ర 7 స్థానాలకు 56 శాతం ఓటింగ్ జరిగింది
Apr 11, 2019, 8:42 pm IST
లక్షద్దీప్
లక్షద్వీప్ ఒక్క స్థానానికి జరిగిన పోలింగ్‌కు 66 శాతం ఓటింగ్ రికార్డైంది
Apr 11, 2019, 8:41 pm IST
బీహార్
బీహార్ 4 స్థానాలకు 50 శాతం పోలింగ్ నమోదైంది
Apr 11, 2019, 8:40 pm IST
అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ 2 స్థానాలకు జరిగిన పోలింగ్‌కు 66 శాతం ఓటింగ్ నమోదైంది
Apr 11, 2019, 7:37 pm IST
తెలంగాణలో ఓవరాల్ గా 61శాతం పోలింగ్ నమోదు.. -రజత్ కుమార్
Apr 11, 2019, 7:35 pm IST
తెలంగాణ ఎన్నికల సరళిపై వివరాలు మీడియాకు అందిస్తున్న ఎన్నికల అదికార రజత్ కుమార్..
Apr 11, 2019, 5:00 pm IST
మొత్తంగా పోలింగ్ 60శాతం దాటే అవకాశం ఉందన్న ఈసీ
Apr 11, 2019, 5:00 pm IST
తెలంగాణ
తెలంగాణలో ముగిసిన పోలింగ్..మధ్యాహ్నం 3 గంటల సమయానికి 48శాతం పోలింగ్ నమోదు
Apr 11, 2019, 4:30 pm IST
తెలంగాణ
తెలంగాణలో 13 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
Apr 11, 2019, 2:37 pm IST
మహారాష్ట్ర
నాగ్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రపంచంలోనే అతి చిన్న మరుగుజ్జు మహిళ జ్యోతి ఆమ్గే
నానక్‌రామ్ గూడాలో ఓటు హక్కు వినియోగించుకున్న అక్కినేని నాగచైతన్య దంపతులు
Hyderabad: Tollywood actors Naga Chaitanya and Samantha arrive at a polling station in Nanakramguda, Gachibowli to cast their vote for #IndiaElections2019pic.twitter.com/oFLiit6CTj
రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేసే ముందు రాహుల్ గాంధీ,ప్రియాంకా గాంధీలతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ.తొలిసారిగా ఇలా పూజలు నిర్వహించడం విశేషం
అమేథీకి నామినేషన్ ఫైల్ చేసేముందు భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ
Amethi: Union Minister and BJP leader Smriti Irani and her husband Zubin Irani perform 'pooja' ahead of her filing nomination from Amethi parliamentary constituency #LokSabhaElectionspic.twitter.com/MBpGLEbYpX
వివిధ రాష్ట్రాల్లో ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్ శాతం: నాగాలాండ్ 41% , మేఘాలయా 27%, అరుణాచల్ ప్రదేశ్ 27.48%, తెలంగాణ 22.84%,మిజోరాం 29.8% ,పశ్చిమ బెంగాల్ 38.08%, మణిపూర్ 35.03%
Apr 11, 2019, 11:59 am IST
తెలంగాణ
హైదరాబాదులో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి
Apr 11, 2019, 11:32 am IST
తెలంగాణ
హైదరాబాద్ నందినగర్‌లో సతీసమేతంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Telangana: Working President of Telangana Rashtra Samithi, KT Rama Rao casts his vote at a polling booth in Hyderabad pic.twitter.com/pJ81fUcLLy
మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలిదశ పోలింగ్..18 రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు పోలింగ్
5:09 AM, 11 Apr
ఆంధ్రప్రదేశ్
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు నేడు పోలింగ్
5:09 AM, 11 Apr
తెలంగాణ
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఓటింగ్
5:09 AM, 11 Apr
తెలంగాణ
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఓటింగ్
5:11 AM, 11 Apr
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.93 కోట్ల ఓటర్లు
5:13 AM, 11 Apr
ఆంధ్రప్రదేశ్
ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు, పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోనున్న జగన్, విజయవాడలో ఓటు వేయనున్న పవన్ కళ్యాణ్
5:13 AM, 11 Apr
ఆంధ్రప్రదేశ్
ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు, పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోనున్న జగన్, విజయవాడలో ఓటు వేయనున్న పవన్ కళ్యాణ్
5:16 AM, 11 Apr
ఆంధ్రప్రదేశ్
తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న 10 లక్షల మంది ఓటర్లు... 46120 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
5:19 AM, 11 Apr
ఆంధ్రప్రదేశ్
ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్..అరకులో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్
5:20 AM, 11 Apr
తెలంగాణ
తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. నిజామామాదులో ఉధయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
5:22 AM, 11 Apr
తెలంగాణ
తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.96 కోట్ల మంది ఓటర్లు. బరిలో 443 మంది అభ్యర్థులు
5:27 AM, 11 Apr
ఢిల్లీ
తొలి దశలో పోటీలో నిలవనున్న పలువురు ప్రముఖులు,కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజుజు,వీకే సింగ్
6:19 AM, 11 Apr
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో ఘటన. 100కు పైగా ల్యాప్‌టాప్‌లు దగ్ధం.షార్ట్‌సర్క్యూటే కారణం అని ప్రాథమిక విచారణలో వెల్లడి
6:30 AM, 11 Apr
పశ్చిమ బెంగాల్
మరికాసేపట్లో పశ్చిమ బెంగాల్‌లోని రెండు పార్లమెంటరీ స్థానాలకు ప్రారంభం కానున్న పోలింగ్. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికలు సంఘం
West Bengal: Outside visuals from polling booths 173,174 and 175 in Cooch Behar, ahead of the voting for #LokSabhaElections2019. Voting on two parliamentary constituencies in the state for the first phase of elections will be held today. pic.twitter.com/rIz5ARK5C3
గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా దౌర్జన్యం... గుత్తిలో ఓ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన మధుసూదన్ గుప్తా..అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
#WATCH Jana Sena MLA candidate Madhusudhan Gupta smashes an Electronic Voting Machine (EVM) at a polling booth in Gooty, in Anantapur district. He has been arrested by police. #AndhraPradeshpic.twitter.com/VoAFNdA6Jo
India is all set for its election festival. A few moments from now India will go for voting. In the first phase voting will take place for 91 loksabha constituencies. Totally 20 states will participate in voting in the first phse. AndhraPradesh, Sikkim, Odisha and Arunachal Pradesh will also be voting for their state assembly.