పని చెయ్యని ఈవీఎం... ద్వంసం చేసిన జనసేన అభ్యర్థి... గుప్తా అరెస్ట్.

Recommended Video

    Lok Sabha Elections 2019 : ఈవీఎంను విసిరికొట్టిన జనసేన అభ్యర్థి || Oneindia Telugu

    ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది . ఒక పక్క అధికారులు ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ బూతుల వద్ద 144 సెక్షన్ అమలు అవుతుంది.

    అనంతపురం జిల్లా గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ సమయంలో నియోజకవర్గం పేరు సరిగా రాయలేదని ఆగ్రహానికి గురయ్యారు. ఇక కోపంతో ఆయన చేసిన నిర్వాకం తీవ్ర చర్చనీయాంశమైంది.

    Pavans Janasena candidate smashes EVM in AP and arrested

    ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి బూత్ లోపలికి వచ్చిన మధుసూదన్ గుప్తా, అక్కడున్న ఇతర పార్టీల ఏజంట్లతో గొడవ పడటమే కాకుండా, ఈవీఎంను నేలకేసి కొట్టారు. దీంతో ఒక ఈవీఎం పని చేయకుండా పోయింది. అంతకుముందు ఆయన ఓటింగ్ కంపార్ట్ మెంట్లలో నియోజకవర్గం పేరును సరిగా రాయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ కు ఉపయోగించే ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+