నూతన ఆర్మీ చీఫ్ ఖరార్: పాకిస్తాన్ పై ఆపరేషన్లల్లో సిద్ధహస్తుడు

లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నూతన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమితులయ్యారు. ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సైనిక దళాల అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి అధికారికంగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈ అత్యున్నత పదవికి ఆయనను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ధీరజ్ సేథ్.. ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆలమ్నీ. డిసెంబర్ 1986లో ఆర్మర్డ్ కార్ప్స్‌లోకి కమిషన్ అయ్యారు. 1997లో 20 లాన్సర్స్ విభాగానికి చెందిన జనరల్ శంకర్ రాయ్ చౌదరి పదవీ విరమణ చేసిన తర్వాత, సుమారు 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆర్మీ చీఫ్ పదవిని చేపడుతున్న మొట్టమొదటి ఆర్మర్డ్ కార్ప్స్ రక్షణ అధికారిగా ఆయన నూతన రికార్డు సృష్టించబోతున్నారు.

Lt Gen Dhiraj Seth Appointed As New Indian Army Chief Historic Appointment From Armed Corps

సరిహద్దుల్లో విశేష సేవలు

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సైనిక ప్రస్థానం కలిగిన ధీరజ్ సేథ్‌కు అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలు, కఠినమైన సరిహద్దు వాతావరణాల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఎడారి రీజియన్ లో ఆర్మర్డ్ రెజిమెంట్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. అలాగే అప్పట్లో పాకిస్థాన్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1- స్ట్రైక్ కార్ప్స్‌లోని పటియాలాకు చెందిన 98 ఆర్మర్డ్ బ్రిగేడ్‌కు కూడా నాయకత్వం వహించారు.

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద నిరోధక గ్రిడ్‌లో భాగమైన డివిజన్ స్థాయి సేనా విభాగం యూనిఫాం ఫోర్స్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. లెఫ్టినెంట్ జనరల్‌గా పదోన్నతి పొందిన తర్వాత 21 స్ట్రైక్ కార్ప్స్‌కు నాయకత్వం వహించడంతో పాటు ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా కీలక సేవలను అందించారు. ఆ తర్వాత సౌత్ వెస్ట్రన్ అండ్ సదర్న్ కమాండ్స్ రెండింటికీ కమాండర్‌గా వ్యవహరించారు.

వ్యూహాత్మక బాధ్యతలు, ఆధునికీకరణ

సైన్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్టాప్ అండ్ స్ట్రాటజిక్ నియామకాల్లో ఆయన భాగస్వామ్యం ఉంది. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లోని ఓ స్వతంత్ర ఆర్మర్డ్ బ్రిగేడ్‌కు బ్రిగేడ్ మేజర్‌గా పనిచేశారు. అంగోలాలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్‌లో ఆపరేషన్స్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ మిలిటరీ సెక్రటరీగా కూడా పని చేయడం ఆయన కెరీర్ ముఖ్యాంశాలలో ఒకటి.

సౌత్ వెస్ట్రన్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ ఆపరేషన్స్‌ బాధ్యతలతో పాటు డైరెక్టర్ జనరల్ డిసిప్లిన్, సెరెమోనియల్ అండ్ వెల్ఫేర్ విభాగాలను కూడా పర్యవేక్షించారు. స్ట్రాటజిక్ ప్లానింగ్, మెకనైజ్డ్ ఫోర్సెస్ కేపబిలిటీ డెవలప్‌మెంట్‌, ఆధునికీకరణ రోడ్‌మ్యాప్ తయారీలో బిగ్రేడియర్ పర్‌స్పెక్టివ్ ప్లాన్స్ అండ్ అక్విజిషన్స్, కేపబిలిటీ డెవలప్‌మెంట్ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+