Lovers: ప్రియుడిని కత్తులతో పొడిచి అతని ముందే ప్రియురాలి మీద ముగ్గురు ?, వీడియోలు తీసి ఎస్కేప్ !
కాలేజ్ ప్రేమికులు ఓ చెరువు సమీపంలోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్లి ప్రియుడిని కత్తులతో పొడిచి కాలేజ్ అమ్మాయి మీద సామూహిక లైంగిక దాడి చేసి వీడియోలు తీశారు.
చెన్నై/విల్లుపురం: ఒకే కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రతిరోజూ కాలేజ్ లో కలుస్తున్న ప్రేమికులు కాలేజ్ పూర్తి అయిన తరువాత కొంతసేపు మాట్లాడుకుని ఇంటికి వెలుతున్నారు. ఎప్పటి లాగే కాలేజ్ ప్రేమికులు ఓ చెరువు సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్బంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్లి ఇద్దరిని కత్తులతో బెదిరించారు. తరువాత ప్రియుడిని కత్తులతో పొడిచారు. కాలేజ్ అమ్మాయి మీద సామూహిక లైంగిక దాడి చేసి వీడియోలు వీడియోలు తీశారు. ప్రేమికుల దగ్గర ఉన్న బంగారు నగలు, డబ్బు, మొబైల్ ఫోన్లు లాక్కొని పరారైనారు. తీవ్రంగా గాయపడిన ప్రేమికులు ఐసీయూలో ఉన్నారు.

ఒకే కాలేజ్ లో లవర్స్
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రవాండి సమీపంలోని చింతామణి గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు. అయ్యంగోయిల్పట్టు గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి చింతామణిలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఒకే కాలేజ్ లో చదువుతున్న ఇద్దరూ ఏడాది నుంచి ప్రేమలో ఉన్నారని సమాచారం.

చెరువు దగ్గరకు వెళ్లిన ప్రేమికులు
ప్రతిరోజు కాలేజ్ లో కలుస్తున్న ప్రేమికులు కాలేజ్ పూర్తి అయిన తరువాత కొంతసేపు మాట్లాడుకుని ఇంటికి వెలుతున్నారు. ఎప్పటిలాగే నిన్న సాయంత్రం ప్రేమికులు విక్రవాండి సమీపంలోని చెంగమేడు చెరువు దగ్గరకు వెళ్లి అక్కడ కుర్చుని మాట్లాడుకుంటున్నారని సమాచారం. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ప్రేమికులు ఉన్న చోటకు వెళ్లారు. ముగ్గురు వ్యక్తులు ప్రేమికులను కేకలు వేస్తే ఇక్కడే చంపేస్తామని కత్తులతో బెదిరించారు.

కాలేజ్ అమ్మాయి వీడియోలు తీసి ?
కత్తులతో బెదిరించడంతో ప్రేమికులు హడలిపోయారు. ఆ సమయంలో కామాంధులు ప్రియుడిని కత్తులతో పొడిచారు. ప్రియుడిని కత్తులతో పొడవడంతో ప్రియురాలు హడలిపోయింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల యువతి మీద ముగ్గురు కామాంధులు ఒకరి తరువాత ఒకరు లైంగిక దాడి చేశారు. కాలేజ్ అమ్మాయి మీద లైంగిక దాడి చేసే సమయంలో నీచులు మొబైల్ లో వీడియోలు తీశారని సమాచారం.

ప్రియుడికి తీవ్రగాయాలు
తరువాత ఇద్దరి దగ్గర ఉన్న బంగారు నగలు, మొబైల్ ఫోన్లు, డబ్బు లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. కత్తిపోట్లో ఎక్కువగా పడటంతో తీవ్రగాయాలైన కాలేజ్ అబ్బాయి విల్లుపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సామూహిక లైంగిక దాడికి గురైన కాలేజ్ అమ్మాయి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు.

8 ప్రత్యేక టీమ్ లు
ఈ దారుణ ఘటనపై విక్రవాండి పోలీసులు కేసు నమోదు చేశారు. విల్లుపురం డీఎస్పీ పార్థీబన్ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రేమికుల మీద దాడి చేసి ప్రియురాలి మీద కామాంధులు సామూహిక లైంగిక దాడి చెయ్యడం విల్లుపురం జిల్లాలో కలకలం రేపింది. గతంలో ఇలాగే పొల్లాచ్చిలో కాలేజ్ ప్రేమికులను టార్గెట్ చేసి సామూహిక లైంగిక దాడులు చేసిన ముఠా ఇప్పుడు జైల్లో ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications