ధోనీ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం! వరల్డ్ కప్‌ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్.. చేరేది ఆ పార్టీలోనే!!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాజకీయనాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందా..? జార్ఖండ్ డైనమైట్ ధోనీ ఏ పార్టీలో చేరనున్నాడు..? ఇప్పటికే తెరవెనక సంప్రదింపులు జరుగుతున్నాయా..? క్రికెటర్లు తమ ఇన్నింగ్స్ ముగిశాకా రాజకీయాల వైపే ఎందుకు చూస్తున్నారు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రజాక్షేత్రంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న ధోనీ

ప్రజాక్షేత్రంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న ధోనీ

మహేంద్రసింగ్ ధోనీ... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటి వరకు క్రికెట్ గ్రౌండ్‌లో సత్తా చాటిన ధోనీ ఇక ప్రజాక్షేత్రంలో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా మన్ననలు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ..ఇప్పుడు రాజకీయాల్లో కూడా అరంగేట్రం చేసి తన సత్తా చాటాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టీమిండియాను మాత్రమే మానిటర్ చేసిన ధోనీ... ఇకపై జార్ఖండ్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయి ప్రజా సేవ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

ధోనీ కమలం కండువా కప్పుకునే అవకాశం

ధోనీ కమలం కండువా కప్పుకునే అవకాశం

ప్రస్తుతం తన చివరి వరల్డ్ కప్‌లో ధోనీ ఆడుతున్నారు. పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో ధోనీపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రపంచకప్ తర్వాత ఆయన క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. అయితే చాలామంది క్రికెటర్లు తాము రిటైర్ అయ్యాక వెంటనే పాలటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఇలా క్రికెట్ నుంచి రాజకీయాల వైపు అడుగులు వేసిన వారిలో మనోజ్ ప్రభాకర్, కీర్తి ఆజాద్, శ్రీశాంత్, తాజాగా ఎంపీ గౌతం గంభీర్. ఈ కోవాలోకే జార్ఖండ్ డైనమైట్ కూడా చేరనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మహేంద్ర సింగ్ ధోనీ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

    తానా సభలు కాదు అవి.... వారి భజన సభలు-కన్నా
    జార్ఖండ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ధోనీ..?

    జార్ఖండ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ధోనీ..?

    ఈ ఏడాది చివరిలో జార్ఖండ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ లోపే ధోనీని బీజేపీలో చేర్పించుకుని ఆయన్నే జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేయాలనే ఆలోచనతో కమలనాథులు ఉన్నట్లు సమాచారం. ధోనీకి మెరుగైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ ధోనీ కమలం పార్టీ కండువా కప్పుకుంటే బీజేపీ తిరిగి అధికారంలోకి సునాయాసంగా వస్తుందనే నమ్మకం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ... అనతి కాలంలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. పాకిస్తాన్‌పై విశాఖలో చేసిన సెంచరీ మరువలేనిది. బ్యాటింగ్‌లో దూకుడును చూపించే ధోనీ... భారత్‌ను పలు కీలక సమయాల్లో విజయం వైపు నడిపించారు. ధోనీ సారథ్యంలో ఐసీసీ నిర్వహించే అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలు భారత్ గెలిచింది. ఇందులో ఐసీసీ వరల్డ్ కప్ , ఐసీసీ టీ-20 వరల్డ్ కప్‌, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి.

    ఇదిలా ఉంటే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన శ్రీశాంత్ ఓటమి పాలయ్యారు. అయితే ఢిల్లీ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మరో క్రికెటర్ గౌతం గంభీర్ గెలిచారు. మరోవైపు ధోనీ భారత్ తరపున ఇంకా క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటున్నట్లు ధోనీ కోచ్ చెప్పారు. అయితే రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేయడాన్ని కూడా తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+