పిచ్చా? దేశద్రోహమా?: కంగనా రనౌత్‌పై వరుణ్ గాంధీ ఫైర్, ‘అసలైన స్వాతంత్ర్యం 2014లోనే’

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతదేశానికి అసలైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చింది. అంతకుముందు 1947లో మనకు లభించింది భిక్షం. ఆ విధంగా దొరికినదాన్ని స్వాతంత్ర్యంంగా పరిగణిస్తామా? అని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.

అసలైన స్వాతంత్ర్యం 2014లోనేనంటూ కంగనా రనౌత్

అసలైన స్వాతంత్ర్యం 2014లోనేనంటూ కంగనా రనౌత్

బ్రిటీష్ పాలన, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి.. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కంగన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి అసలైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చింది. అంతకుముందు 1947లో మనకు లభించింది భిక్షం. ఆ విధంగా దొరికినదాన్ని స్వాతంత్ర్యంంగా పరిగణిస్తామా? అని అన్నారు.

కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆమె వ్యాఖ్యలకు మద్దతు పలుకుతుండగా, చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు.

పిచ్చితనమా? దేశ ద్రోహమా? అంటూ కంగనాపై వరుణ్ గాంధీ తీవ్ర ఆగ్రహం

ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను ఖండించారు. ఆమె వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి.. ఇలాంటి ఆలోచనను పిచ్చితనంగా భావించాలా? లేక దేశ ద్రోహంగానా? అంటూ ధ్వజమెత్తారు. కొన్నిసార్లు మహాత్మాగాంధీ త్యాగాలు, దీక్షకు అవమానం.. మరికొన్నిసార్లు ఆయన హంతకుడికి గౌరవం. ఇప్పుడు మంగళ్ పాండే మొదలు రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఇలా లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పట్ల తిరస్కార దోరణి. ఈ ఆలోచనను పిచ్చితనంగా పిలవాలా? లేదా దేశ ద్రోహంగానా? అని తీవ్రంగా స్పందించారు వరుణ్ గాంధీ. కాగా, గతంలో నాథూరాం గాడ్సేను కీర్తించినవారిపైనా వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సమర్థించుకుంటున్న కంగనా రనౌత్

సమర్థించుకుంటున్న కంగనా రనౌత్

కాగా, ఇటీవల కంగనా రనౌత్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందజేసిన విషయం తెలిసిందే. దీనిపైనా ఆమెను నెట్టింట్లో నెటిజన్ల విమర్శలు గుప్పిస్తున్నారు.

దీనిపై ఇప్పటికే నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. ఈ కాంట్రవర్సీ క్వీన్‌ పద్మ అవార్డుల ప్రధానం తర్వాత మాట్లాడుతూ.. దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని భారత ప్రభు త్వం గుర్తించినందుకు తాను చాలా గర్వపడుతున్నానని కంగనా ఆ వీడియోలో పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌ చేస్తున్నా అవే మి పట్టించుకోకుండా ఆమె తన మాటలన సమర్థించుకుంటోంది కంగన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+