Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌లో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్..!

మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా పిచ్చి పట్టింది అనేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలలో ఈ విష సంస్కృతిని అరికట్టేందుకు 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాపై నిషేధం విధించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు భారత్ లో కూడా ఇదే రకంగా చర్యలు తీసుకోనున్నారా అంటే.. అందుకు సంకేతాలు అవుననే సమాధానం చూపిస్తున్నాయి.

ఈ మేరకు సోషల్ మీడియా వినియోగం చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక సూచనలు చేసింది. 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చట్టం తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సిఫార్సు చేసింది. కాగా ఈ సూచనకు ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న చట్ట నమూనాను ఆధారంగా చేసుకుని చేయడం గమనార్హం.

madras-high-court-recommend-to-government-about-ban-on-social-media-for-below-16-years

ఇందుకు గాను ఎస్. విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు, హింసాత్మక కంటెంట్ పిల్లలకు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల వారి జీవితం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని పిటిషనర్ తన వాదన వినిపించారు. చిన్నారులు ఇలాంటి కంటెంట్‌ను చూడకుండా అడ్డుకునేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు, నియంత్రణ వ్యవస్థలు అభివృద్ధి చేయాలని కోరారు.

అయితే పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, అశ్లీల మరియు హానికరమైన కంటెంట్ పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది. చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల మానసిక ఒత్తిడి, దృష్టి లోపం, వ్యసన ప్రవర్తన, లైంగిక దోపిడీ ప్రమాదం, సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్లల భద్రత దృష్ట్యా 16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరం చేసే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

అలాంటి చట్టం అమల్లోకి వచ్చేలోపు.. చిన్నారుల్లో, తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో సోషల్ మీడియా ప్రమాదాలపై విస్తృత అవగాహన కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ కార్యక్రమాల్లో జాతీయ, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌లు చురుకుగా పాల్గొనాలని కూడా ధర్మాసనం సూచించింది. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలు తెరవడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది.

ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే సోషల్ మీడియా సంస్థలకు భారీ జరిమానాలు, కఠిన నియంత్రణలు, విధించేలా నిబంధనలు రూపొందించింది. ఆస్ట్రేలియాలో అమలవుతున్న ఈ విధానాన్ని భారత్‌లో కూడా పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. డిజిటల్ యుగంలో పిల్లల భద్రత కోసం చట్టపరమైన నియంత్రణలు తప్పనిసరి అని ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు సోషల్ మీడియా పూర్తిగా నిషేధం కాకపోయినా, వయస్సుకు తగిన పరిమితులు, కంటెంట్ ఫిల్టర్లు, తల్లిదండ్రుల పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని న్యాయస్థానం సూచించింది. ఈ సూచనలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నియంత్రణపై చర్చను మరింత వేగవంతం చేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+