ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మేజిక్ ఫిగర్.. ఏ రాష్ట్రంలో ఎంత?
ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. ఏ పార్టీకి ఎంత మెజారిటీ రావాలి, అసలు ఏ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ ఎంత అనేది చూద్దాం..
న్యూఢిల్లీ: మినీ సార్వత్రిక సమరంగా పిలిచిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దేశంలోకెల్లా జనాభాలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది.
ఉత్తరాఖండ్, మణిపూర్ లోనూ కమలనాథులు జోరుమీదున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, గోవాలో హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. ఏ పార్టీకి ఎంత మెజారిటీ రావాలి, అసలు ఏ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ ఎంత అనేది చూద్దాం..
ఉత్తరప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 403. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. సగం కంటే ఎక్కువగా అంటే.. 202 సీట్లు గెలుచుకోవాలి. ఇప్పటికే బీజేపీ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

పంజాబ్ లో.. మొత్తం 117 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 59 సీట్లు కైవసం చేసుకోవడం అవసరం. అటు ఉత్తరాఖండ్ లో చూస్తే.. మొత్తం 70 సీట్లలో 36 సీట్లు గెలుచుకున్న పార్టీయే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది.
ఇక మణిపూర్ లో.. మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 31 స్థానాల్లో గెలుపు సాధించడం అవసరం. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ లభించకపోయినా, కూటమిగా ఏర్పడడం ద్వారా మెజారిటీ తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications