ఆ లిస్ట్‌లో ఎన్ని ట్విస్ట్‌లో

Maharashtra Assembly elections 2024: దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ముహూర్తం కుదిరింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఇటీవలే విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.

288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో పోలింగ్ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే.

Maharashtra Assembly elections 2024 NCP releases first list of 38 candidates

ఈ ఎన్నికల కోసం ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 202. ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సారి సంపూర్ణ మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి ఆయా పార్టీలన్నీ కూడా.

ఈ పరిస్థితుల మధ్య- ఎన్నికల్లో పోటీ చేయబోయే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థులతో కూడిన తొలి జాబితా వెలువడింది. మొత్తం 38 మందికి చోటు లభించిందీ లిస్ట్‌లో. ఎన్సీపీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వల్సే పాటిల్, ధనంజయ్ ముండే, ధర్మరావ్ బాబా, ఆదితి తత్కరే వంటి నేతల పేర్లు ఇందులో ఉన్నాయి.

అజిత్ పవార్ మరోసారి బారాబంకీ నుంచి బరిలో దిగారు. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయడం ఇది ఎనిమిదో సారి. 1991లో ఉప ఎన్నికలో గెలిచిన తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదాయనకు. ఇప్పటివరకు ఓటమి అనేదే తెలియదు. 2019 ఎన్నికల్లో 1,65,641 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన గోపీచంద్ పడాల్కర్‌ను మట్టికరిపించారు.

నిజానికి- ఈ నియోజకవర్గం శరద్ పవార్‌కు కంచుకోట. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు దీన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ స్థానాన్ని తన మేనల్లుడు అజిత్ పవార్‌కు కేటాయించారు. ఇప్పడు సీన్ రివర్స్ అయింది. బీజేపీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో బారాబంకీపై ట్విస్ట్ ఏర్పడింది. శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.

ఛగన్ భుజ్‌బల్- యెవ్‌లా, దిలీప్ వాల్సే పాటిల్- అంబేగావ్, ధనంజయ్ ముండే- పరలి, ధర్మారావు బాబా ఆత్రం- అహేరి, ఆదితి తిత్కరే- శ్రీవర్ధన్, ఉద్గిర్- సంజయ్ బన్సొడే, పింప్రి- అన్నా బన్సొడే, సంగ్రామ్ జగ్తాప్- అహ్మద్ నగర్ సిటీ, దత్తాత్రేయ భరానె- ఇందాపూర్, ఇగత్‌పురి- హిరమన్ ఖోస్కర్, అమరావతి సిటీ- సులభా ఖోడ్కే, నవాపూర్, భరత్ గవిట్, పత్రి- నిర్మలా ఉత్తమ్ రావ్ విటేకర్ పోటీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+