రైతన్నలకు సర్కార్ బంపర్ ఆఫర్: 56 లక్షల మందికి లబ్ధి!

మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు తీపికబురు చెప్పింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పుట్టినరోజు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జయంతి సందర్బంగా రాష్ట్రంలోని 553 మంది రైతులకు రుణమాఫీకి సంబంధించిన మొదటి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. రాష్ట్ర సహకార శాఖ మంత్రి బాబాసాహెబ్ పాటిల్ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఉపశమనం కలిగించే ఓ నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.36,585 కోట్లు కేటాయించింది. దీనివల్ల 56 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. మహాత్మా ఫూలే రైతు రుణమాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న 12 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ లభిస్తుందని బాబాసాహెబ్ పాటిల్ వెల్లడించారు. రుణమాఫీ మొదటి జాబితాలో 553 మంది రైతులు ఉన్నారు. మహారాష్ట్రలో రైతులకు ఇదే అతిపెద్ద రుణమాఫీ అనిమంత్రి పేర్కొన్నారు.

రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.36,585 కోట్లు కేటాయించింది, దీనివల్ల 56 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతారు. అదనంగా, 2019 మహాత్మా ఫూలే రుణమాఫీ పథకం ద్వారా లబ్ధి పొందిన 12 లక్షల మంది రైతులకు ఈసారి కూడా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ లభించనుంది. ఈ మొత్తం సుమారుగా రూ. 4,395 కోట్లు. ఈ విధంగా ప్రభుత్వం రైతులకు మొత్తం రూ. 40,980 కోట్ల రుణాలను మాఫీ చేస్తోంది.

Maharashtra Farmer Loan Waiver Rs 40 980 Cr Scheme to Benefit 56 Lakh Farmers First List Released

553 మంది రైతుల పేర్ల జాబితా విడుదల.
రాష్ట్ర సర్కారు 553 మంది రైతుల పేర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో అమరావతి జిల్లా బ్యాంకు నుంచి 58 మంది, లాతూర్ జిల్లా బ్యాంకు నుండి 133 మంది, నాగ్‌పూర్ జిల్లా బ్యాంకు నుంచి 16 మంది, పుణే జిల్లా బ్యాంకు నుంచి 85 మంది, సతారా జిల్లా బ్యాంకు నుంచి 38 మంది, థానే జిల్లా బ్యాంకు నుంచి 182 మంది రైతుల పేర్లు ఉన్నాయి. ఈ రైతులకు చెందిన రూ.2 కోట్ల 99 లక్షల 37 వేల 540 రూపాయల రుణాన్ని మాఫీ చేశారు. అర్హులైన రైతులకు 2026 జులై 31 లోగా ప్రయోజనాలు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా బ్యాంకులు, కేంద్ర బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+