Rebel: సీఎంకు షాక్, విద్యాశాఖా మంత్రి జంప్, రెబల్ గ్రూప్ లో 8 మంది మంత్రులు, గంటల్లోనే గోవిందా గోవింద !

ముంబాయి/గుహవాటి: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రుల మద్దతు పెరుగుతోంది. సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు కొందరు ఏక్ నాథ్ షిండే వర్గంలోకి జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారని ప్రచారం జరగడం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లరని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యేలు కాకుండా సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గంలో ఉన్న శివసేన మంత్రి ఆదివారం గుహవాటి చేరుకుని ఏక్ నాథ్ షిండేకి మద్దతు తెలపడంతో ఉద్దవ్ ఠాక్రే వర్గం హడలిపోయింది. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గానికి డబుల్ షాక్ ఇచ్చేశారు.

ఏక్ నాథ్ ఏమి మాయ చేశాడో ?

ఏక్ నాథ్ ఏమి మాయ చేశాడో ?

శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ఏమి మాయ చేశారో అనే విషయంపై మహారాష్ట్రలో, శివసేన పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రుల మద్దతు పెరుగుతోంది.

 ఏకంగా మంత్రి జంప్

ఏకంగా మంత్రి జంప్

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు కొందరు ఏక్ నాథ్ షిండే వర్గంలోకి జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారని ప్రచారం జరగడం హాట్ టాపిక్ అయ్యింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లరని ఆయన మద్దతుదారులు ధీమాగా చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో సీఎం గ్రూప్ లోని ఓ మంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూప్ లోకి వెళ్లిపోవడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గం హడలిపోయింది.

 నేరుగా వెళ్లిపోయిన మంత్రి

నేరుగా వెళ్లిపోయిన మంత్రి

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని 12 మంది ఎమ్మెల్యేలు కాకుండా సీఎం వర్గంలో ఉన్న శివసేన పార్టీకి చెందిన మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖా మంత్రి ఉదయ్ సామంత్ ఆదివారం అసోంలోని గుహవాటి చేరుకుని ఏక్ నాథ్ షిండేకి మద్దతు తెలపడంతో ఉద్దవ్ ఠాక్రే వర్గం హడలిపోయింది.

8 మంది మంత్రులు తిరుగుబాటు

8 మంది మంత్రులు తిరుగుబాటు

నిన్నటి వరకు ఏక్ నాథ్ షిండే వర్గంలో 7 మంది రెబల్ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మరో మంత్రి ఉదయ్ సామంత్ చేరికతో ఏక్ నాథ్ షిండే వర్గంలో 8 మంది రెబల్ మత్రులు ఉన్నారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గానికి డబుల్ షాక్ ఇచ్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+