MH Results: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా - మోదీ ఛాయిస్..!!
Maharashtra Election Results: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు. మహాయుతి అనూహ్య విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 210 స్థానాల్లో బీజేపీ కూటమి అధిక్యత సాధించింది. బీజేపీ సింగిల్ గా 100 స్థానాలు గెలుపు దిశగా దూసుకెళ్తోంది. మూడు పార్టీల మహా యుతి కూటమి నుంచి ఇప్పుడు కాబోయే సీఎం ఎవరనే చర్చ మొదలైంది. అయితే, బీజేపీ అధిక స్థానాలు గెలవటంతో ఆ పార్టీకే సీఎం పదవి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, బీజేపీ నుంచి సీఎం అభ్యర్ధి ఖాయంగా కనిపిస్తోంది. మోదీ చాయిస్ పైన క్లారిటీ వస్తోంది.
సీఎం అయ్యేదెవరు
మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. మహాయుతి కూటమి ఏకపక్షంగా అధికారం వైపు దూసుకెళ్తోంది. బీజేపీ నాయకత్వంలోని మహాయుతి అధికార పీఠంకు చేరువైంది. మహాయుతి లో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంది. బీజేపీతో పాటుగా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలు అనూహ్య ఫలితాలు సాధించాయి. దీంతో, ఇక మహాయుతి నుంచి సీఎం ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుత సీఎం షిండే తిరిగి సీఎం గా కొనసాగుతారని శివసేన నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈ దిశగా కామెంట్స్ మొదలు పెట్టారు. షిండే పాలన.. మూడు పార్టీల సమన్వయంతోనే ఈ స్థాయిలో భారీ విజయం సాధించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆ ఇద్దరి ఆశలు
ఇక, అజిత్ పవార్ పేరును ఆ పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావన చేస్తున్నారు. బారామతి నుంచి అజిత్ పవార్ భారీ మెజార్టీలో కొనసాగుతున్నారు. అజిత్ పవార్ ఎంట్రీతోనే మహాయుతికి మంచి స్పందన కనిపించిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కూటమిగా మూడు పార్టీల సమన్వయం.. ఎన్సీపీ నుంచి వ్యతిరేకించి బయటకు వస్తూనే..ఆ పార్టీకి భారీ నష్టం చేసి మహాయుతికి మేలు చేసారని గుర్తు చేస్తున్నారు. గతంలోనే అజిత్ పవార్ కు సీఎం పదవి పైన ఆఫర్ వచ్చిందని చెప్పుకొస్తున్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం తాము కూటమిలో మెజార్టీ స్థానాలు సాధించటంతో తమకే సీఎం పీఠం దక్కుతందని ధీమాగా ఉన్నారు. అయితే, ప్రధాని మోదీ - అమిత్ షా నిర్ణయం కీలకంగా మారనుంది.

ఫడ్నవీస్ కే ఛాన్స్
బీజేపీ నుంచే సీఎం అభ్యర్ధి ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అందులో భాగంగా మాజీ సీఎం.. ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తిరిగి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీ నాయకత్వం సైతం ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర లో షిండే ను సీఎం చేసే సమయంలో ఫడ్నవీస్ పార్టీ నాయకత్వానికి పూర్తిగా సహకరించారు. ఇక, ప్రస్తుత ఎన్నికల్లో మూడు పార్టీల సమన్వయం.. ఆరెస్సెస్ తో కో ఆర్డినేషన్ తో పాటుగా ప్రచార వ్యూహాల్లోనూ ఫడ్నవీస్ కీలకంగా వ్యవహరించారు. ప్రధాని మోదీ, అమిత్ షా సైతం ఫడ్నవీస్ పైన సానుకూలంగా ఉన్నారు. దీంతో, మహారాష్ట్ర నూతన సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications