Shiv Sena: సీఎంకు సినిమా స్టోరీ చెప్పి ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రత్యక్షం, నలుగురు ఎమ్మెల్యేలు జంప్ జిలాని !
ముంబాయి/గుహవాటి/సూరత్: మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ? అంటూ దేశం మొత్తం చర్చించుకుంటోంది. మరాఠీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ లీడర్, రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే ఎవ్వరూ ఊహించని విదంగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పటికే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టిన ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి చాకచక్యంగా స్కెచ్ లు వేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శిభిరంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి సీక్రేట్ గా సూరత్ వెళ్లిపోయారు. సీఎంకు సినిమా స్టోరీ చెప్పిన మరో నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా అసోంలోని గుహవాటిలో రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఉంటున్న ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రత్యక్షం అయిన సమయంలో తీసిన వీడియో గురువారం బయటకు రావడంతో శివసేన నాయకులు బిత్తరపోయారు.
రాత్రికి రాత్రి జంప్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్రలోని మాహిమ్ నియోజక వర్గం ఎమ్మెల్యే సదా సావార్కార్, కుర్లా నియోజక వర్గం ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి బుధవారం రాత్రి జెండా ఎత్తేసి బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లోని సూరత్ నగరానికి వెళ్లిపోయారు.
సీఎంకు సినిమా స్టోరీ చెప్పి జంప్
బుధవారం వరకు మేము చివరి వరకు మీతోనే ఉంటాము, మేము మీకు ద్రోహం చెయ్యలేమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి చెప్పిన మరో నలుగురు శివసేన పార్టీ ఎమ్మెల్యేలు బ్యాగ్ సర్దుకుని అసోంలోని గుహవాటిలో రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ఉంటున్న రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రత్యక్షం అయ్యారు.
ఏక్ నాథ్ స్కెచ్ లతో షాక్
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే ఎవ్వరూ ఊహించని విదంగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పటికే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టిన ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలను లాగేసుకోవడానికి స్కెచ్ లు వేస్తున్నారు.
ఫైవ్ స్టార్ హోటల్ వీడియో వైరల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శిభిరంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి సీక్రేట్ గా సూరత్ వెళ్లిపోయారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా అసోంలోని గుహవాటిలోని రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ముందు ప్రత్యక్షం అయ్యారు. ఫైవ్ స్టార్ హోటల్ లో ఏక్ నాథ్ షిండేతో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో తీసిన వీడియో గురువారం బయటకు రావడంతో శివసేన నాయకులు బిత్తరపోయారు.












Click it and Unblock the Notifications