వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా కరోనా ప్రళయం: ఒకేరోజు 985 మంది బలి -కొత్తగా 63,309 కేసులు -టీకాలు ఆలస్యం -లాక్‌డౌన్ లాగే

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి రెండో దశ విలయంలోనూ తీవ్ర ప్రభావానికి గురైన మహారాష్ట్రలో వైరస్ మరోసారి పంజా విసిరింది. ఒకేరోజు దాదాపు 900 మందిని పొట్టనపెట్టుకుంది. కొత్త కేసుల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. తాజా గణాంకాలతో యాక్టివ్ కేసుల సంఖ్య అమాంతం ఏడు లక్షలకు చేరువైంది. వైరస్ వ్యాప్తి ఉధృతి కారణంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగనుంది. కట్టడి చర్యల్లో భాగంగా జనం కదలికలపై ఆంక్షలను మరో 15రోజులపాటు పెంచాలని ఉధ్ధవ్ సర్కారు నిర్ణయించింది. వివరాల్లోకి వెళితే...

కరోనా: ఆగస్టు నాటికి హెర్డ్‌ ఇమ్యూనిటీ -యూరప్ సాధించబోతోంది -బయోఎన్‌టెక్‌ చీఫ్ ఉగుర్‌ సాహిన్‌కరోనా: ఆగస్టు నాటికి హెర్డ్‌ ఇమ్యూనిటీ -యూరప్ సాధించబోతోంది -బయోఎన్‌టెక్‌ చీఫ్ ఉగుర్‌ సాహిన్‌

మ‌హారాష్ట్ర‌ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,309 పాజిటివ్ కేసులు, 985 మ‌ర‌ణాలు నమోదయ్యాయి. ఈ నంబర్లు రాష్ట్ర చరిత్రలో అత్యధికం కావడం గమనార్హం. తాజా పెరుగుదలతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 44,73,394కు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 67,234కు పెరిగింది.

 Maharashtra reports record 985 Covid-19 deaths in a day; over 63,000 new cases

రాష్ట్రంలో గత 24 గంటల్లో 61,181 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జీల సంఖ్య 37,30,729కు చేరిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం 6,73,481 యాక్టివ్ కేసులు ఉండగా, 31,159మంది మాత్రమే ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. మిగతావారంతా హోం క్వారంటైన్ లోనే ఉన్నారని బులిటెన్ లో పేర్కొన్నారు. కాగా,

జగన్ బెయిల్ రద్దు: నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు -మే7 డెడ్‌లైన్ -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖజగన్ బెయిల్ రద్దు: నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు -మే7 డెడ్‌లైన్ -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ

కరోనా మహమ్మారి ఉద్దృతితో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత టీకాలు అందించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే బుధవారం వెల్లడించారు. అయితే ఉచిత టీకా పంపిణీ మే 1 నుంచి ప్రారంభించబోమని అన్నారు. రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగుతాయన్న మంత్రి టీకా పంపిణీ ఆలస్యానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు

Recommended Video

India Records 3.46 Lakh New Cases In 24 Hours | Oneindia Telugu

కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మే 1 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. అయితే కేసుల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల లేకపోవడంతో మరిన్ని రోజులు నిబంధనలు పొడిగించాలని ఠాక్రే సర్కారు యోచిస్తోంది. మే 15 వరకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని చూస్తోంది.

English summary
Maharashtra on Wednesday reported its Covid-19 highest death toll ever since the beginning of the pandemic with 985 more virus-related fatalities added in the last 24 hours. On Tuesday, the state had reported 895 deaths, the second highest. The death toll from novel coronavirus infection has now reached 67,214, according to the health bulletin. Along with that, the state also reported 63,309 new Covid-19 cases in a day, taking the total tally to 44,73,394.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X