బీజేపీకి సీఎం పదవి పై షిండే కొత్త ఫిట్టింగ్ - దక్కేదెవరికి..!!
మహారాష్ట్రకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు. మూడు పార్టీల మహాయుతి కూటమి అనూహ్య విజయం నమోదు చేసింది. కాంగ్రెస్ కూటమి అడ్రస్ గల్లంతు చేసింది. మహాయుతి కూటమి ఏకంగా 225 స్థానాలకు పైగా విజయం దిశగా దూసుకెళ్తోంది. సింగిల్ గా బీజేపీ 125 స్థానాలు గెలవటంలో ఆ పార్టీకే సీఎం పదవి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో తాజా సీఎం షిండే షాక్ ఇచ్చారు. దీంతో, ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు. ఈ నెల 26న కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.
సీఎం పీఠం దక్కేదెవరికి
మహారాష్ట్ర ఎన్నికల్లో మమాయుతి కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభావం తప్పలేదు. మహాయుతి ఏకంగా 225 స్థానాల్లో విజయం సాధించి ఊహించని ఫలితం నమోదు చేసింది. ఇక..మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలైంది. బీజేపీకి అధిక సీట్లు రావటంతో ఆ పార్టీ ముఖ్య నేత ఫడ్నవీస్ సీఎం అవుతారని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫడ్నవీస్ తో బీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. సీఎం పదవి స్వీకరించాల ని ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకుందామని ఫడ్నవీస్ పార్టీ నేతలకు సూచించారు. ఇటు తాజా సీఎం షిండే కీలక వ్యాఖ్యలు చేసారు.

షిండే వ్యాఖ్యలతో
ఎక్కువ సీట్లు వచ్చిన వారు సీఎం కావాలని లేదంటూ షిండే చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఎన్నికల వేళ షిండేను సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. అటు అజిత్ పవార్ సైతం పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి సమావేశంలో సీఎం ఎవరనేది చర్చిస్తామంటూ షిండే వ్యాఖ్యానించటంతో బీజేపీ క్యాంపు అప్రమత్తం అయింది. అందరితో చర్చించిన తరువాత సీఎం ఎవరనేది ఖరారు అవుతుందని షిండే చెప్పుకొచ్చారు. దీంతో, ఈ నెల 25న బీజేపీ శాసనసభా పక్షం సమావేశానికి నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున కొత్త నేత గురించి గవర్నర్ కు సమాచారం ఇవ్వనున్నారు. ఈ నెల 26న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బీజేపీ నేతల వ్యూహాలు
బీజేపీ ముఖ్య నేతలు మాత్రం తమ పార్టీ నుంచే సీఎం ఉంటారని స్పష్టం చేస్తున్నారు. పొత్తులో భాగంగా షిండే తమతో కలిసిన సమయంలో తాము డిప్యూటీ సీఎం పదవి తీసుకొని షిండేను సీఎం చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక, బీజేపీ నుంచి ఫడ్నవీస్ పేరు ముందు వరుసలో ఉంది. పార్టీ జాతీయ నాయకత్వానికి విధేయుడుగా ఉండటంతో పాటుగా ఆరెస్సెస్ మద్దతు.. పార్టీలో అందరితోనూ సఖ్యత కలిసొచ్చే అంశం. షిండే, అజిత్ పవార్ తో కూటమి నిర్వహణలోనూ ఫడ్నవీస్ కీలకంగా వ్యవహరించారు. దీంతో, రేపు (ఆదివారం) బీజేపీ అధినాయకత్వం మహారాష్ట్ర లో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 25న ఎల్పీ భేటీ, 26న కొత్త ప్రభుత్వం ఏర్పడేలా కసరత్తు జరుగుతోంది.













Click it and Unblock the Notifications