ఢిల్లీలో గెలవాలంటే వారి నిర్ణయమే 'పవర్' ఫుల్..!!
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్ఠా త్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆకర్షణీయమైన హామీలు గుప్పిస్తు న్నాయి. బీజేపీ - ఆప్ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి ఢిల్లీలో గతం కంటే భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్రిముఖ పోటీలో గెలుపు పైన మూడు పార్టీల్లోనూ అంచనా లు పెరుగుతున్నాయి. కానీ, ఇక్కడ గెలుపు ఇప్పుడు మహిళా ఓటర్ల పైనే ఆధార పడి ఉంది. దీంతో, వారి ఓటింగ్ ఎవరికి అనుకూలం అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
మహిళా ఓటర్లపై గురి
ఢిల్లీలో మూడు ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని కేజ్రీవాల్ ముందుగానే రంగంలోకి దిగారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే మహిళా ఓటర్ల పాత్ర కీలకం గా మారింది. మొత్తం ఓటర్లలో 46శాతం అంటే సుమారు 71లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు. దీంతో మహిళలను ఆకట్టుకునే క్రమంలో భాగంగా ఆప్ నెలకు రూ 2,100 చొప్పున మహిళలకు ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది. దీనికి పోటీగా బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు రూ 2,500 ఇస్తామని హామీ ఇచ్చాయి. అదే విధంగా గర్భిణీలకు ఆర్దిక సాయం..బస్సుల్లో మహిళ లకు ఉచిత ప్రయాణం వంటి హామీలు ఇస్తున్నాయి.

బీజేపీ ఆశలు
ఈ సారి ఢిల్లీలో అధికారం పై బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునే క్రమంలో మహిళలకు తమ మేనిఫెస్టోలో మహిళా సమృద్ధి యోజన కింద నెలకు రూ. 2,500... గర్భిణులకు రూ.21వేల ఆర్థిక సాయం, ఆరు పౌష్టికాహార కిట్లు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ.5వేలు, రెండో సంతానం సమయంలో రూ.6వేలకు ఇవి అదనంగా ఇవ్వటంతో పాటుగా పేద కుటుంబాలకు రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్. హోలీ, దీపావళి పండుగుల సమయంలో ఒకటి ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. అదే విధంగా అటల్ క్యాంటీన్ల ఏర్పాటు చేసి రూ.5కే భోజనం, 60 నుంచి 70ఏళ్ల వయోధికులకు రూ.2,500 ఇస్తామని... 70ఏళ్లు పైబడిన వారికి రూ.3వేలు ఇస్తామని పేర్కొంది.
మద్దతు ఎవరికి
ఆప్ మహిళలకు ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయాలను రూ 2,100 కి పెంచుతామని హామీ ఇచ్చింది. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాలు, అదనంగా విద్యార్థినీలందరికీ మెట్రో ఛార్జీల పై 50శాతం తగ్గింపు సౌకర్యం కల్పిస్తామని ఆప్ పేర్కొంది. కాంగ్రెస్ సైతం ఇదే రకమైన హామీలతో ముందుకొచ్చింది. మహిళలకు ప్రతీనెలా రూ. 2,500, రూ. 500లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్,
300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం ఇస్తామని..జీవన్ రక్ష యోజన కింద రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పైన హామీ ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు సగానికి పైగా ఉన్న మహిళా ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications