ఇండి కూటమిలోకి రండి: మల్లిఖార్జున ఖర్గే పిలుపు, మోడీ ఓడిపోయారన్న నేత
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తేలిన నేపథ్యంలో దేశ రాజధానిలో ఎన్డీఏ కూటమితోపాటు ఇండియా కూటమి నేతలు కూడా వేర్వేరుగా తమ తమ మిత్రపక్షాలతో సమావేశమయ్యాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవగా.. ఇండియా కూటమి నేతలు వారి భేటీలో తమ పాత్రపై చర్చించుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వచ్చిందన్నారు. మోడీ నైతికంగా ఓడిపోయారన్నారు. అంతేగాక, వ్యక్తిగతంగా, రాజకీయంగానూ నష్టపోయారని విమర్శించారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఇండియా కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఖర్గే ప్రకటన చేశారు.

ఈ ఎన్నికల్లో ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా సమన్వయంగా బాగా పోరాడాయని ఖర్గే ప్రశంసించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనతేలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతోపాటు శరద్ పవార్ (ఎన్సీపీ-ఎస్‌పీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), సంజయ్ రౌట్ (శివసేన-ఉద్ధవ్‌ఠాక్రేవర్గం), సంజయ్ సింగ్ (ఆప్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అభిషేక్ బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), చంపయ్ సోరెన్ (జేఎంఎం), రాఘవ్ చద్దా (ఆప్), డి.రాజా (సీపీఐ), సుప్రియా సూలే, కల్పనా సోరెన్ సహా పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

#WATCH | INDIA bloc leaders hold a meeting at the residence of Congress president Mallikarjun Kharge in Delhi.
— ANI (@ANI) June 5, 2024
(Source: AICC) pic.twitter.com/1xtYlqQviE
మరోవైపు ఎన్డీయే నేతలు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీయే పక్షాలు మోడీని కూటమిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జూన్ 7న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. నరేంద్ర మోడీ జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications