వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీతో బాబుల్ సుప్రియో భేటీ-సింగింగ్ కొనసాగించాలన్న సీఎం-ఆమె మాటలే సంగీతమంటూ పొగడ్తలు..

|
Google Oneindia TeluguNews

ఇటీవలే బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి,టీఎంసీ అధినేత మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. మమతా బెనర్జీ మాటలు తన చెవులకు సంగీతంలా వినిపించాయని భేటీ అనంతరం పేర్కొన్నారు.'మమతా బెనర్జీని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.టీఎంసీ కుటుంబంలో ఆమె నన్ను సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో మనసు పెట్టి పనిచేయమన్నారు. అలాగే సింగింగ్‌ను కొనసాగించమని విజ్ఞప్తి చేశారు.వచ్చే దుర్గా నవరాత్రుల సందర్భంగా పాటలు పాడాలని అన్నారు.' అని బాబుల్ సుప్రియో పేర్కొన్నారు. మమతా బెనర్జీతో భేటీ చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. బాబుల్ సుప్రియో స్వతహాగా మంచి సింగర్ అన్న సంగతి తెలిసిందే. అందుకే సింగింగ్‌ను కొనసాగించాలని మమత కోరినట్లు తెలుస్తోంది.

ఆ విషయం ఎవరూ కాదనలేరు : సుప్రియో

ఆ విషయం ఎవరూ కాదనలేరు : సుప్రియో


అంతకుముందు,బాబుల్ సుప్రియో మాట్లాడుతూ... 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారని పేర్కొన్నారు.'మన పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ 2024లో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కీలక పాత్ర పోషిస్తుంది.వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని రేసులో మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారన్నది ఎవరూ కాదనలేరు.' అని బాబుల్ సుప్రియో పేర్కొన్నారు.పార్టీ మార్పుపై స్పందిస్తూ.. పార్టీ మారడం ద్వారా తానేమీ చరిత్ర సృష్టించలేదని సుప్రియో అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంతోమంది నేతలు టీఎంసీని వీడి బీజేపీలో చేరారని గుర్తుచేశారు. ఇప్పటికీ బీజేపీ సీనియర్ నేతల్లో పార్టీపై తీవ్ర ఆగ్రహం ఉందని... ఆ కారణమేంటో బీజేపీ తెలుసుకోవాలని అన్నారు.

టీఎంసీ మౌత్ పీస్‌లోనూ...

టీఎంసీ మౌత్ పీస్‌లోనూ...


ఇటీవల టీఎంసీ మౌత్ పీస్ 'జాగో బంగ్లా' పత్రికలో... ప్రధాని మోదీని ఢీకొట్టగల ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని ఒక వ్యాసం ప్రచురితమైంది.మోదీని ఢీకొట్టగల శక్తి,సామర్థ్యాలు మమతా బెనర్జీకి మాత్రమే ఉన్నాయని అందులో పేర్కొన్నారు.తాజాగా బాబుల్ సుప్రియో చేసిన వ్యాఖ్యలతో... మున్ముందు టీఎంసీ నేతలు మమతను ప్రధాని అభ్యర్థిగా బలంగా ముందుకు తెచ్చే అవకాశం కనిపిస్తోంది.బాబుల్ సుప్రియో ఇటీవలే బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.అసన్‌సోల్ ఎంపీ అయిన సుప్రియో... కొద్ది నెలల క్రితం జరిగిన కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కేంద్రమంత్రి పదవిని కోల్పోయారు.అప్పటినుంచి బీజేపీ అధిష్ఠానంపై ఆయన గుర్రుగా ఉన్నారు. రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని ఆ మధ్య ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత... రాజకీయాల్లో ఉంటానని,అయితే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తీరా ఇప్పుడు టీఎంసీలో చేరిపోయారు.

ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీ?:


2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రత్నామ్నాయ కూటమి కోసం మమతా బెనర్జీ కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.కొద్ది నెలల క్రితం ఆమె ఢిల్లీలో సోనియా,రాహుల్,ప్రశాంత్ కిశోర్‌లతో వరుస భేటీలు జరిపారు.ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోనూ మమత చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఎన్డీయే వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహించినా తాను పనిచేసేందుకు సిద్దమని మమతా బెనర్జీ ఆ సందర్భంగా ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి బీజేపీ ఎత్తులను చిత్తు చేయడం ద్వారా మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కోగల సత్తా,సామర్థ్యం తనకే ఉందని మమత నిరూపించుకున్నట్లయింది.అప్పటినుంచి ప్రధాని అభ్యర్థిగా అడపాదడపా ఆమె పేరు చర్చల్లో వినిపిస్తూనే ఉంది.చూడాలి మరి 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో... అసలు ప్రతిపక్ష కూటమి ఏర్పడుతుందో లేదో...!!

English summary
Former Union Minister Babul Supriyo, who recently left the BJP and joined the Trinamool Congress, recently met Bengal Chief Minister and TMC chief Mamata Banerjee. He said after the meeting with Mamata Banerjee that her words sounded like music to her ears.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X