వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ కార్డులో పేరు తప్పు: రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కాన్వాయ్ కు అడ్డు పడ్డాడు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆధార్ కార్డులో పేరు తప్పు: రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కాన్వాయ్ కు అడ్డు పడ్డాడు..!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాన్వాయ్ కు అడ్డు పడ్డాడో వ్యక్తి. నడిరోడ్డుపై రాజ్ నాథ్ సింగ్ ప్రయాణిస్తోన్న కాన్వాయ్ లోని వాహనాలకు అడ్డుగా నిల్చున్నాడు. కొన్ని క్షణాల పాటు కాన్వాయ్ ను కదలకుండా ఆపేశాడు. మంగళవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో పార్లమెంట్ భవనం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల్లో కలవరాన్ని నింపింది.

Disha murder case: శంషాబాద్ హైవేపై మద్యం దుకాణాలను మూసేయాలంటూ.. !Disha murder case: శంషాబాద్ హైవేపై మద్యం దుకాణాలను మూసేయాలంటూ.. !

రాజ్ నాథ్ సింగ్ కాన్వాయ్ కు అడ్డు పడ్డ వ్యక్తి పేరు విశంబర్ దాస్ గుప్తా. 35 సంవత్సరాలు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఖుషీగంజ్ కు చెందిన వ్యక్తి. అతనికి మానసిక స్థిరత్వం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్యాహ్నం పార్లమెంట్ సమావేశాల నుంచి బయటికి వచ్చిన రాజ్ నాథ్ సింగ్ తన కాన్వాయ్ లో తన కార్యాలయం వైపు బయలుదేరారు. కాన్వాయ్ లోని వాహనాలు పార్లమెంట్ ప్రధాన గేటు దాటుకుని బయటికి వచ్చిన కొద్ది సేపటికే.. విశంబర్ దాస్ గుప్తా వాటికి అడ్డు పడ్డాడు.

Man lies down in front of Defence Minister Rajnath Singhs convoy demanding name change in Aadhaar card at New Delhi

కాన్వాయ్ వస్తోన్న సమాచారం తెలుసుకున్న వెంటనే.. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడే వాహనాలను నిలిపి వేశారు. జనసమ్మర్థం లేకుండా చేశారు. అయినప్పటికీ.. ఎక్కడి నుంచి వచ్చాడో గానీ.. నేరుగా దాస్ గుప్తా కాన్వాయ్ లోని వాహనాలను అడ్డుగా నిల్చున్నాడు. అతణ్ని చూసిన వెంటనే డ్రైవర్ కాస్సేపు వాహనాన్ని నిలిపివేశాడు. దీన్ని గమనించిన వెంటనే పోలీసులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు హుటాహుటిన కాన్వాయ్ వద్దకు చేరుకుని, దాస్ గుప్తాను పక్కకు లాక్కెళ్లారు.

తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవాలనుకుంటున్నానని ఈ సందర్భంగా దాస్ గుప్తా గట్టిగా కేకలు వేశాడు. ఆధార్ కార్డులో తన పేరు తప్పుగా ప్రచురితమైందని, దాన్ని సరిదిద్దాలని అన్నారు. ఈ కారణంతోనే తాను రాజ్ నాథ్ సింగ్ కాన్వాయ్ కు అడ్డు పడ్డానని చెప్పాడు. ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉండటం వల్ల ప్రభుత్వం అందించే పథకాలేవీ తనకు దక్కట్లేదని వాపోయాడు. కాగా- అతనికి మానసిక స్థిరత్వం లేదని పోలీసులు వెల్లడించారు. అతణ్ని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

English summary
A 35-year-old man, suspected to be mentally unstable, lied down on the road near Parliament on Tuesday when Defence Minister Rajnath Singh's convoy was approaching, police said. The man, identified as Vishambhar Das Gupta, a resident of Kushinaga in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X