ఫోన్ బిజీతో అనుమానం: భార్యను గంగలో తోసేశాడు

Man pushes wife into Ganga for doubt of infidelity
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య శీలంపై అనుమానంతో ఆమెను గంగా నదిలో తోసేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. బాధితురాలు తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రవి చౌరాసియా తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెప్పారు. తన భార్యపై అనుమానంతోనే గంగలో తోసేసినట్లు రవి పోలీసుల ముందు అంగీకరించాడు.

నిందితుడు రవి చౌరాసియా పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. చకేరిలోని సఫిపూర్‌లో రవి చౌరాసియా, రూబీలకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల తర్వాత నుంచి రవి ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉండేదని, అడిగితే తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్పేదని రవి తెలిపాడు.

అయితే రవి చెప్పేదంతా అబద్ధమని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పారు. అతని అనుమానం బుద్ధితోనే తమ కూతురును హత్య చేశాడని వారు ఆరోపించారు. తమ సోదరితో రవికి ఇది రెండో వివాహమని బాధితురాలి సోదరుడు చందన్ తెలిపాడు. రవి పెట్టే వేధింపులు పడలేకనే అతని మొదటి భార్య అతడ్ని విడిచిపెట్టిందని చెప్పాడు.

రవి అనుమానించడంతో గత కొద్ది నెలల నుంచి రూబీ తన తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉంటోంది. కాగా, శనివారం సాయంత్రం నయగంజ్ మార్కెట్ వద్ద తనను కలవాల్సిందిగా రూబీని కోరాడు రవి. తనను ఔటింగ్‌కు తీసుకెళ్తానని.. ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దని రవి ఆమెకు చెప్పాడు. అయితే ఆమె తన సోదరుడికి చెప్పి రవి వద్దకు వెళ్లింది.

కొంత సేపటి తర్వాత ఆమె సోదరుడు ఆమెకు ఫోన్ చేయగా ఫోన్ స్విఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన రూబీ కుటుంబసభ్యులు రవికి ఫోన్ చేశారు. అయితే అతడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగా బ్యారెజ్ వద్ద ఓ వ్యక్తి తన భార్యను గంగా నదిలో తోసేశాడని, అతడ్ని స్థానికులు చితకబాదారాని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నిందితుడు రవిని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+