వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హృదయవిదారకం: ఏడేళ్ల కూతురు మృతదేహాన్ని మోసుకుని 10 కి.మీ నడిచిన తండ్రి

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ తండ్రి తన కుమార్తె మృతదేహాన్ని భుజాన మోసుకుని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలానికి చేరుకున్నాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. అందాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ ఏడేళ్ల కుమార్త అనారోగ్యానికి గురికావడంతో స్థానిక వైద్యుల వద్ద చికిత్స చేయించాడు. అయినప్పటికీ ఆమెకు తీవ్ర జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం లఖాన్పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే చిన్నారి పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ స్థాయి కూడా 60కి పడిపోయింది.

 Man Seen Carrying Daughters Body For 10 Km in Chhattisgarh, Probe Ordered

వైద్యులు అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. శుక్రవారం చికిత్స పొందుతూ కూతురు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు తండ్రి. పాప మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి వద్ద అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో చేసేదేంలేక ఈశ్వర్ దాస్ కుమార్తె మృతదేహాన్ని భుజనా మోసుకుని 10 కిలోమీటర్ల దూరం ఉన్న తన గ్రామానికి నడుచుకుంటూ చేరుకున్నాడు.

కాగా, ఈశ్వర్ దాస్ తన కుమార్తె మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్తుండగా పలువురు వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడంతో వైరల్‌గా మారింది. దీంతో అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది వాదన మరోలా ఉంది. అంబులెన్స్ వస్తుందని, కాసేపు వేచివుండాలని ఆస్పత్రి సిబ్బంది కోరినప్పటికీ.. పాప మృతదేహాన్ని తీసుకెళ్లారని రూరల్ మెడికల్ అసిస్టెంట్ డాక్టర్ వినోద్ భార్గవ్ వెల్లడించారు.

English summary
Man Seen Carrying Daughter's Body For 10 Km in Chhattisgarh, Probe Ordered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X