వింతలకే..! తన భార్యను తీసుకెళ్లాడని.. సైట్ కొట్టి ఆమె ప్రియుడి సతీమణిని పెళ్లాడాడు!
పాట్నా: ఇటీవల కాలంలో వివాహేతర బంధాలు పెరిగిపోతున్నాయి. ఆకర్షణకు లోనై తమ నిండు సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. హత్యలు, ఆత్మహత్యలకు కారణమై తమను నమ్ముకున్నవారిలో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా, ఓ బీహార్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. తన భార్యను ఎత్తుకెళ్లిన నిందితుడి సతీమణిని వివాహమాడాడు బాధితుడు.

ఆమెకు, అతడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు కానీ..
ఖగాడియా జిల్లాలోని చౌథామ్‌బ్లాక్ లోని హార్డియా గ్రామానికి చెందిన ముఖేష్.. నీరజ్ అనే వ్యక్తి భార్యతో పరారయ్యాడు. దీంతో ముఖేష్ భార్యను నీరజ్ వివాహం చేసుకున్నాడు. అయితే, నీరజ్ కు ఇప్పటికే నలుగురు సంతానం కావడం గమనార్హం. అంతేగాక, ఈ ఘటనతో సంబంధమున్న ఇద్దరు మహిళల పేర్లు కూడా రూబీయే కావడం ఆసక్తికర అంశంగా మారింది.

నలుగురు పిల్లలున్న తన ప్రియురాలిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు
కాగా, ముఖేష్‌తో వెళ్లిపోయిన రూబీకి వివాహానికి ముందు నుంచే అతనితో పరిచయం ఉంది. పెళ్లిక ముందు అతడిని ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా పరిచయాన్ని కొనసాగించింది. మరోవైపు, ముఖేష్ కూడా గతంలోనే వివాహమైంది. అయితే, గత సంవత్సరం ఫిబ్రవరిలో అతను ప్రియురాలు రూబీని ఇంటి నుంచి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం వారిద్దరూ.. తమ ముగ్గురు సంతానాన్ని తీసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయారు.

తన భార్య ప్రియుడి సతీమణికి సైట్ కొట్టి.. పెళ్లాడాడు బాధితుడు!
ఈ క్రమంలో ముఖేష్ తో తన భార్య వెళ్లిపోయిన విషయం నీరజ్‌కు తెలియడంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టగా.. ప్రియురాలిని విడిచి ఉండేందుకు ముఖేష్ అంగీకరించలేదు. దీంతో ముఖేష్‌పై పగ తీర్చుకునేందుకు నీరజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముఖేష్ మొదటి భార్య రూబీతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 18న స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం టిట్ ఫర్ ట్యాట్‌గామారిపోయింది. కాగా, నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. ముఖేష్ రోజు కూలీగా పనిచేస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications