సయీద్‌తో రామ్‌దేవ్ అనుచరుడు: రాజ్యసభలో రభస
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ర హఫీజ్‌తో యోగా గురు రామ్‌దేవ్ అనుచరుడు, జర్నలిస్టు భేటీ భారతదేశంలో వివాదానికి దారి తీసింది. ఫ్రీలాన్స్ జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ జమాతే ఉద్ దవా చీఫ్ సయీద్ హఫీజ్‌ను ఈ నెల 2వ తేదీన లాహోర్‌లో కలిశాడు. పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్‌లో పర్యటించిన జర్నలిస్టులు, రాజకీయ నాయకుల బృందంలో వైదిక్ ఉన్నారు.
వారిద్దరి మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోగ్రాఫ్ సోషల్ మీడియాలో సందడి చేసింది. దీంతో వైదిక్ విషయంపై కాంగ్రెసు బిజెపిపై విరుచుకుపడింది. ఈ వివాదం రాజ్యసభలో సోమవారం అట్టుడికింది. హఫీజ్‌తో వైదిక్ భేటీకి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఉందా అని కాంగ్రెసు నిలదీసింది. ముంబై పేలుళ్ల నిందితుడిని వైదిక్ కలవడమేమిటని ప్రశ్నించింది.

వైదిక్‌ను విచారించాలని బిఎస్పీ డిమాండ్ చేసింది. రాజ్యసభలో ఈ విషయంపై రగడ జరిగింది. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెసు సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ఆ విషయాన్ని లేవనెత్తారు.దీనిపై తీవ్ర రభస జరగడంతో చైర్మన్ హమీద్ అన్సారీ మొదట 15 నిమిషాల పాటు రాజ్యసభను వాయిదా వేశారు.
దిగ్విజయ్ సింగ్ ఆ సమావేశం చేసిన ట్వీట్‌కు సమాధానంగా వైదిక్ తాను ఏ ప్రధానికి కూడా ప్రత్యేకమైన దౌత్యవేత్తను కానని, తనకు తానే దౌత్యవేత్తనని ట్వీట్ చేశారు. వాళ్లు పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తవచ్చునని, అయితే దానివల్ల వచ్చే ఫలితం ఏదీ ఉండదని అన్నారు. తాను బుద్ధిజీవినని, రస్సెల్, కార్ల్ మార్క్స్ వంటి బుద్ధి జీవులు ఏ దేశానికీ చెందరని వైదిక్ అన్నారు.












Click it and Unblock the Notifications