బాలికపై నెల రోజులుగా తండ్రి, అంకుల్ అత్యాచారం
ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 13 ఏళ్ల మైనర్ బాలిక పైన ఆ బాలిక తండ్రి, అంకుల్ అత్యాచారానికి పాల్పడ్డారు. వారు నెల రోజులుగా ఆమె పైన ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారని పోలీసులు శుక్రవారం నాడు తెలిపారు.
బాధిత బాలిక ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి, మామ గత నెలన్నర రోజులుగా బాలికను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

బాధిత బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఆమె తన తండ్రితో కలిసి కలానీ నగర్‌లో ఉంటోంది. తల్లి, తండ్రులు ఏడాది క్రితం వేరుపడ్డారు. బాలికపైన నెల రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న తండ్రి, అంకుల్‌లు ఆమెను బెదిరించారు. ఎవరితోనైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
దీంతో ఆమె ఎవరికి చెప్పలేకపోయింది. వారి వేధింపులు భరించలేని బాలిక తమ ఇంటి పక్కనున్న వారికి చెప్పింది. పక్కింటి వారు, సోషల్ ఆర్గనైజేషన్ సంస్థల సహకారంతో బాలిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల పైన పోలీసులు ఐపీఎస్ సెక్షన్ 376(అత్యాచారం), 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications