ఎత్తుకెళ్లి అమ్మాయిపై నాలుగు రోజులు నలుగురు గ్యాంగ్ రేప్
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. నలుగురు యువకులు 15 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి, వరుసగా నాలుగు రోజులపై ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ధీందాల్వీ గ్రామంలో జరిగింది.
నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిని యువకులు సోమవారంనాడు ఎత్తుకెళ్లారు. బహర్భూమికి వెళ్లినప్పుడు ఆమెను తుపాకితో బెదిరించి ఆమెను అపహరించారు. ఆమెను ఓ ఇంటికి తీసుకుని వెళ్లి నాలుగు రోజుల పాటు నిర్బంధించి వరుసగా అత్యాచారం చేశారు.

స్పృహ తప్పిన అమ్మాయిని పోలీసులు గురువారంనాడు రక్షించారు. అమ్మాయి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఆమెను కనిపెట్టారు. జనవరి 26వ తేదీన నలుగురు వ్యక్తులు తనను ఎత్తుకెళ్లి నాలుగు రోజులు అత్యాచారం చేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో చెప్పింది.
ముకేష్, ప్రదీప్, కుల్లు, దుశ్యంత్ తనను కిడ్నాప్ చేసి, సమీపంలోని ఇంట్లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ముకేష్, ప్రదీప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరిని పట్టుకోవాల్సి ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications