ముస్లీంలంతా ఏకం కావాలి: నక్వీ, హిందువులు శాంతి కోరుకుంటారు: దలైలామా
ఢిల్లీ: తీవ్రవాదుల చేష్టలు ఇస్లాం సందేశానికి హాని కలిగిస్తున్నాయని బిజెపి నేత, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ ప్రపంచానికి ఉగ్రవాదమే పెను సవాలుగా మారిందని ఆయన మండిపడ్డారు.
తప్పుదారి పట్టిన కొంతమంది చర్యలు కరుణ, శాంతి, ఐక్యత, సహోదరభావం వంటి ఇస్లాం నిజమైన సందేశానికి హాని కలిగిస్తున్నాయన్నారు. ఈజిప్టు లక్సర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
మానవత్వానికీ, ఇస్లాంకూ అతిపెద్ద శత్రువులుగా మారిన ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా ఇస్లామిక్ ప్రపంచం ఏకం కావాలని పిలుపునిచ్చారు. మత చర్చలో సంస్కరణలు అవసరమన్నారు. ముస్లింలకు కొత్త దార్శనికత, ఇస్లాంపై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు.

ఆత్మపరిశీలన, స్వీయదిద్దుబాటుకు ఇదే సమయమన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో యువత సామాజిక సమగ్రత ముఖ్యమైనదనీ, వారికి ఉద్యోగాలు, మెరుగైన ఆర్థిక అవకాశాలు కల్పించాలన్నారు. ఇలాంటి విధానం భారత్‌లో విజయవంతమైందన్నారు.
మెజార్టీ హిందువులు శాంతినే నమ్ముతారు: దలైలామా
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా శనివారం నాడు మాట్లాడుతూ... శాంతి, స్నేహానికి భారత్ ఎంతోకాలంగా పేరుగాంచిందని చెప్పారు. హిందువుల్లో మెజార్టీ శాంతిని, స్నేహాన్నే కోరుకుంటారని చెప్పారు. భారత్‌లో అన్ని మతాల వారికి సమాన గౌరవం ఉంటుందని చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications