అదృశ్యమైన భారత మహిళ: యూకేలో దారుణ హత్య
లండన్: ఇంగ్లాండ్ దేశంలో 15 రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి మహిళ పర్దీప్ కౌర్ దారుణంగా హత్య చేయబడ్డారు. లండన్‌లోని హీత్రో విమానాశ్రయం సమీపంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
వివాహిత అయిన పర్దీప్ కౌర్ ఓ హోటల్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. అక్టోబర్ 16న ఆమె ఉద్యోగానికి వెళ్లిన తర్వాత మళ్లీ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఆమె విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడని, గొంతు పిసికి చంపి హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
విమానాశ్రయం సమీపంలో లభ్యమైన మృతదేహాన్ని పర్దీప్ కౌర్ దిగా గుర్తించారు.
ఆమె మిస్సింగ్ కేసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారించామని, ఆ తర్వాత వారిని వదిలేశామని చెప్పారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించడంతోపాటు, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications