బిగ్ షాక్.. అత్యాచార ఆరోపణల కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ !
కేరళ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక్కాడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ మామ్‌కుటత్తిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం అర్ధరాత్రి పాలక్కాడ్‌లోని ఓ హోటల్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆయనపై తాజాగా ఓ యువతి ఫిర్యాదు చేసింది. 2024లో రాహుల్ తనపై అత్యాచారం చేసి, గర్భస్రావానికి బెదిరించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధించాడని పేర్కొంది.

రాహుల్‌కు రాజకీయ పలుకుబడి ఉండటంతో ఇన్నాళ్లూ ఫిర్యాదు చేయలేదని ఆ యువతి వెల్లడించింది. అయితే, వరుస అత్యాచార కేసుల నమోదు కావడంతో ఈ నెల 8న పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలో ఓ నటి, మరో యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, రాహుల్ ముందస్తు బెయిల్ పొందారు. ఈ వరుస ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అతడిని ఇప్పటికే బహిష్కరించింది. ఈ అరెస్టులో జోక్యం చేసుకోబోమని, రాహుల్‌కు మద్దతు ఉండబోదని సీనియర్ నేత కె. మురళీధరన్ స్పష్టం చేశారు.
అరెస్టు అనంతరం రాహుల్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ), యువ మోర్చా కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీక్షలు పూర్తయ్యాక జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.












Click it and Unblock the Notifications