మోడీ వ్యాఖ్యలపై దుమారం: బేషరతుగా క్షమాపణకు ఒడిశా పార్టీల డిమాండ్
తమ రాష్ట్రాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అధికార బీజేడీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీని క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశాయి.
భువనేశ్వర్: ఒడిశాను పేద రాష్ట్రంగా పేర్కొనడం పట్ల ప్రధాని మోడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ రాష్ట్రాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అధికార బీజేడీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీని క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశాయి.
మోడీ వ్యాఖ్యలు ఒడిశా అసెంబ్లీని కుదిపేశాయి. అధికార బీజేడీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు మోడీ వ్యాఖ్యలకు నిరసనగా సభలో ఆందోళనకు దిగారు. వారి ఆందోళనలతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో.. స్పీకర్ సభను వాయిదా వేశారు.

కాగా, ఇటీవల ఒడిశాలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మోడీ.. దేశంలో నిరుపేద జిల్లాలు ఎక్కడున్నాయని పరిశీలిస్తే ఒడిశాలో కనిపిస్తాయని, ఒడిశాలోని పేదలు బీజేపీకి మద్దతునిస్తే ఇతర పార్టీలు కొట్టుకుపోతాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఒడిశాలోని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications