స్టాక్ మార్కెట్స్‌లో సునామీ..!!
Sensex today: దేశీయ స్టాక్ మార్కెట్‌లో సునామీ ఏర్పడింది. కనీ వినీ ఎరుగని రీతిలో సెన్సెక్స్ దౌడు తీస్తోంది. పంచకల్యాణిలా పరుగులు పెడుతోంది. గతంలో ఎప్పుడూ లేనవిధంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. లక్షల కోట్ల రూపాయల మేర సంపదను అదనంగా సృష్టించింది.
ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో సెన్సెక్స్ 2,621.98 పాయింట్లతో ఓపెన్ అయ్యాయి. ఈ స్థాయిలో సెన్సెక్స్ రిజిస్టర్ కావడం ఇదే తొలిసారి. దీని ప్రభావంతో ఒక్కసారిగా 76,000 పాయింట్ల మార్క్‌ను అలవోకగా దాటేసింది. శుక్రవారం నాడు 76.71 పాయింట్ల లాభంతో 73,961 పాయింట్ల సెన్సెక్స్ క్లోజ్ కాగా.. ఈ ఉదయం 75,869.99 పాయింట్ల వద్ద ఓపెన్ అయింది.

ఆ తరువాత కొన్ని నిమిషాల్లోనే 76,000 మార్క్‌ను దాటేసింది సెన్సెక్స్. ఉదయం 10:15 నిమిషాలకు 76,101.56 పాయింట్ల ట్రేడింగ్ అయింది. ఈ తొలి సెషన్‌లో ఇదే హయ్యెస్ట్. ఇంట్రాడే ట్రేడింగ్ మొత్తం ఇదే తరహాలో కొనసాగవచ్చంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
అటు నిఫ్టీ కూడా రికార్డు స్థాయిలో లాభపడింది తొలి సెషన్‌లో. అటు నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది. ఏకంగా 807.20 పాయింట్లతో ఓపెన్ అయింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ సైతం అదే స్థాయిలో కనిపించింది. చరిత్రలో తొలిసారిగా బ్యాంక్ నిఫ్టీ 50,000 పాయింట్లను అధిగమించింది. 42 పాయింట్ల లాభంతో 22,530.70 వద్ద శుక్రవారం ట్రేడింగ్ ముగియగా.. ఈ ఉదయం 807.20 లాభంతో 23,321 పాయింట్ల వద్ద ఓపెన్ అయింది.
దీనికి కారణాలు లేకపోలేదు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడమే. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కేంద్రంలో ఎన్డీఏ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ఈ ఎన్నికల్లో 320 నుంచి 350 సీట్లు లభిస్తాయంటూ వెల్లడించాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపాయి.
దీని సానుకూల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడింది. దాదాపుగా అన్ని షేర్లు కూడా గ్రీన్‌లో ట్రేడ్ కావడం కనిపించింది. బ్యాంకింగ్, ఆటొమొబైల్, టెక్, ఫిన్ టెక్, ఇన్సూరెన్స్, కెమికల్, సర్వీస్.. ఇలా దాదాపుగా అన్ని సెగ్మెంట్లకు చెందిన షేర్లన్నీ అప్పర్ సర్క్యుట్‌ను తాకాయి.












Click it and Unblock the Notifications