ఆ కవల సోదరులకు ఎయిర్ పోర్టులో ఊహించని షాక్.. ఫేషియల్ రికగ్నిషన్ చేస్తుండగా..
వాళ్లిద్దరూ కవల సోదరులు. ఐడెంటికల్ ట్విన్స్.. చూడ్డానికి ఒకేళా ఉంటారు. అయితే సోదరులిద్దరూ జర్నీ కోసం ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. డిజియాత్ర యాప్ ద్వారా ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ వారికి షాక్ ఇచ్చింది. ముందు ఒకరు వెళ్లగా స్కాన్ చేసి పంపించింది. ఆ తర్వాత మరొకరు వెళ్లగా యాక్సెస్ డినైడ్ అంటూ స్క్రీన్ పైన చూపించింది. ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే యాక్సెస్ ఉంటుందని స్క్రీన్ పై డిస్ ప్లే అయింది. దీంతో ఆ కవల సోదరులు షాక్ అయ్యారు. చూడ్డానికి వాళ్లిద్దరూ ఒకే రూపంలో ఉండటంతో టెక్నాలజీ కూడా వారిని గుర్తించలేక పోయింది. ఈ క్రమంలో తమ లాంటి వారికోసం ఏదైనా వెసులుబాటు తీసుకురావాలని కోరుతున్నారు.
విమాన ప్రయాణాలు చేసేవాళ్లు డిజియాత్ర యాప్ ను ఉపయోగిస్తుంటారు. ఎయిర్ పోర్టులో ఐడెంటిఫికేషన్ కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. భారీ క్యూ లైన్లలో నిలబడటం సమయం వృథా అనుకున్న వాళ్లు ఈ యాప్ ద్వారా ఈజీగా ఎయిర్ పోర్టులోకి ప్రవేశిస్తారు. వీరికి బోర్డింగ్ ప్రాసెస్ సులువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ ట్విన్ బ్రదర్స్ ముంబై ఎయిర్ పోర్టులోకి ప్రవేశించారు. అయితే ఆ సోదరుల్లో ఒకరికి మాత్రమే డిజియాప్ యాక్సెస్ ఇచ్చింది. మరొకరు కూడా లోపలికి వచ్చేందుకు యత్నించగా యాక్సెస్ డినైడ్ అని చూపించింది. ఒకరికంటే ఎక్కువ మందిని గుర్తించాం అని డిస్ ప్లే అయింది. దీంతో ఆ కవల సోదరులు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇదే విషయంపై ట్విన్ సోదరుల్లో ఒకరైన ప్రశాంత్ మీనన్ స్పందిస్తూ.." నేను నా సోదరుడితో ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చాం. మేమిద్దరం డిజియాత్ర యాప్ లో రిజిస్టర్ చేసుకున్నాం. అయితే మాకు యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. దాంతో మేము రెగ్యులర్ క్యూ లో చేరాల్సి వచ్చింది. దాంతో ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ కోసం మేము రిజిస్టర్ అయిన విధానం వేస్ట్ అయింది" అని తెలిపాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications