Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Covid 19 : 13 నెలల్లో 3 సార్లు కోవిడ్ బారినపడ్డ యువ డాక్టర్... వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా...

కరోనా వ్యాక్సిన్లు కల్పించే రక్షణ,వాటి సమర్థతపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొత్తగా పుట్టుకొచ్చే కోవిడ్ వేరియంట్లపై వాటి ప్రభావం ఏ మేరకు అనేది ప్రస్తుతం అధ్యయన దశలోనే ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కోవిడ్ బారినపడటం చూస్తూనే ఉన్నాం. తాజాగా ముంబైకి చెందిన 26 ఏళ్ల ఓ వైద్యురాలు 13 నెలల వ్యవధిలోనే మూడుసార్లు కరోనా బారినపడ్డారు. అది కూడా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత ఆమె కోవిడ్ బారినపడటం గమనార్హం.

వ్యాక్సిన్ తీసుకున్న నెల రోజులకే...

వ్యాక్సిన్ తీసుకున్న నెల రోజులకే...

డా.సృష్టి హళ్లారి అనే ఆ యువ వైద్యురాలు ప్రస్తుతం ముంబైలోని వీర్ సావర్కర్ ఆస్పత్రిలో కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జూన్ 17న మొదటిసారి ఆమె కోవిడ్ బారినపడ్డారు. స్వల్ప ఇన్ఫెక్షన్ సోకడంతో త్వరగానే కోలుకున్నారు. ఈ ఏడాది మార్చి 8న ఆమె కోవీషీల్డ్ మొదటి డోసు తీసుకున్నారు. ఏప్రిల్ 29న రెండో డోసు తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబమంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న నెల రోజులకే డా.సృష్టి హళ్లారి మరోసారి కోవిడ్ బారినపడ్డారు.

మరో నెల రోజులకు మళ్లీ...

మరో నెల రోజులకు మళ్లీ...

మే 29న డా.సృష్టి హళ్లారికి రెండోసారి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే స్వల్ప లక్షణాలే ఉండటంతో ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. కానీ ఆ తర్వాత మరో నెల రోజులకు మళ్లీ ఆమె ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. జులై 11న ఆమెకు మూడోసారి కోవిడ్ సోకింది. ఈసారి ఆమెతో పాటు ఆమె కుటుంబం మొత్తానికి కోవిడ్ సోకింది. ప్రస్తుతం వారికి రెండెసివిర్‌తో చికిత్స అందిస్తున్నారు. 'మూడోసారి కోవిడ్ బారినపడ్డాక ఆరోగ్య సమస్య తీవ్రమైంది. నేను,నా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరాం.రెండెసివిర్ తీసుకోవాల్సి వచ్చింది. మా అమ్మ,నాన్న,సోదరుడికి డయాబెటీస్ ఉంది. మా నాన్నకు హైపర్ టెన్షన్,కొలెస్ట్రాల్ సమస్యలు కూడా ఉన్నాయి. సోదరుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రెండు రోజులుగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు.' అని తెలిపారు.

Recommended Video

    Covid-19 Vaccines For Kids Likely By September - Dr Randeep Guleria | Oneindia Telugu
    నిపుణులు ఏమంటున్నారు...

    నిపుణులు ఏమంటున్నారు...

    కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా వైరస్ బారినపడుతారని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో దాని తీవ్రత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరణం సంభవించే అవకాశం చాలా తక్కువ అంటున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలోనూ అన్ని ఏజ్ గ్రూప్‌ల వారు వైరస్ బారినపడే ప్రమాదం ఉందని ముంబైకి చెందిన వాక్‌హార్డ్ వైద్యులు డా.బెహ్రామ్ తెలిపారు. అయితే వ్యాక్సిన్ కారణంగా వారు త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+