మోడీని హిట్లర్‌తో పోల్చిన ముంబై మహిళా మేయర్
ముంబై: శివసేన నాయకురాలు, ముంబై నగర మేయర్ స్నేహాల్ అంబేకర్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ప్రధాని నరేంద్ర మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు.డెస్పాచ్ అండ్ కొరియర్‌కు ఇంటర్యూ ఇచ్చిన ఆమె, ప్రధాని నరేంద్ర మోడీని ఓ వైపు పొగుడుతూనే చురకలేశారు.
తన పని తని చేసుకుంటూ పోయే మోడీని ప్రశంసించకుండా ఉండలేనని.. అయితే, కొంత వరకు అతని పాలన హిట్లర్ పాలనను గుర్తుకు తెస్తుందని అన్నారు.

‘నరేంద్ర మోడీ అంటే నాకు గౌరవం. అయితే అది కొంతవరకే. హిట్లర్‌లా ఆయన పరిపాలన సాగుతోంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి' అని ఓ ఇంటర్వ్యూలో స్నేహాల్ అన్నారు.
ముంబై మొదటి దళిత మేయర్ అయిన స్నేహాల్ అంబేకర్ ఎర్ర బుగ్గ కారు వివాదంతో మొదటిసారి వెలుగులోకి వచ్చారు. నగర మేయర్ పదవి ముఖ్యమంత్రి పదవిని పోలినదే అని, ఎర్ర బుగ్గ కారు మేయర్ పదవి హోదాని మరింత పెంచుతుందని ఆమె సమర్థించుకున్నారు.












Click it and Unblock the Notifications