గంటన్నరపాటు ప్రీతి స్టేట్‌మెంట్ రికార్డ్, ఏం చెప్పారు?
ముంబై: బాలీవుడ్ నటి, ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా స్టేట్‌మెంట్‌ను మంగళవారం విచారణ అధికారులు తీసుకున్నారు. తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను ఎక్కడైతే వేధించాడని ప్రీతిజింతా చెబుతున్నారో.. అక్కడే (వాంఖేడే స్టేడియం) పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను తీసుకున్నారు.
వాంఖేడే స్టేడియంలో ప్రీతిజింతా తనకు నెస్ వాడియా నుండి ఎదురైన పరాభవం పూసగుచ్చినట్లుగా చెప్పారని సమాచారం. ప్రీతి 12 నుండి 14 మంది సాక్ష్యులను పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. విచారణాధికారులు వారి స్టేట్‌మెంట్ కూడా త్వరలో తీసుకోనున్నారు.

తనను నెస్ వాడియా వేధించిన మూడు ప్రదేశాలను ఆమె చూపించారు. తనను వేధించినప్పుడు నెస్ స్నేహితులు కూడా కొందరు ఆయన వెంట ఉన్నట్లు చెప్పారని సమాచారం. ఓ జట్టు సభ్యుడి బంధువు (ఆస్ట్రేలియా వ్యక్తి) నెస్ వాడియాను వారించారని చెప్పారు.
తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రీతిజింతా చెప్పిందని పోలీసులు తెలిపారు. సాక్ష్యుల పేర్లు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. అనంతరం విచారణకు సహకరించాలని నెస్ వాడియా తరఫు న్యాయవాదికి పోలీసులు సూచించారు.
కాగా, స్టేట్‌మెంట్ రికార్డ్ కోసం ప్రీతిజింతా తన న్యాయవాదితో కలిసి ఆరు గంటల నలభై నిమిషాలకు వాంఖేడే స్టేడియానికి వచ్చారు. ఇందుకోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆమె స్టేట్‌మెంట్‌ను మరైన్ డ్రైవ్ పోలీసులు రికార్డ్ చేశారు. గంటన్నర పాటు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications