ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన లోకల్ ట్రైన్(వీడియో)
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చర్చిగేట్ స్టేషన్‌లో అదుపు తప్పిన ఓ లోకల్ ట్రైన్ ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో జరిగింది.

ట్రాక్ చివర్న ఉండే బఫర్‌ను ఢీకొన్న రైలు ఇంజన్ భాగం మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్ పైకి ఎక్కింది. ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల వేగాన్ని అదుపుచేసుకోలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలైనట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications