Video: మంత్రికి చుక్కలు చూపించిన మహిళ. పోలీసుల ముందే ఇచ్చి పడేసింది

రాజకీయ నాయకులు రోడ్లపైకి వస్తే గంటల తరబడి ట్రాఫిక్ లో అల్లాడిపోతాం మనం. కానీ ఇంతటి ఇబ్బంది కారణమయ్యే వాళ్లని ఒక్క మాట కూడా గట్టిగా అడగలేము. ఎందుకంటే వాళ్లు దానికి రివైంజ్ తీర్చుకుంటారని సైలెంట్ అయిపోతాం. కరెక్ట్ టైం వచ్చినప్పుడు.. అడిగేవారు, కడిగేసే వారు ఎవరో ఒకకరు వస్తారులే అని మిన్నకుండిపోతాం. కానీ ఒక్కసారి సామాన్యుడు గళం విప్పితే ఎలా ఉంటుంటో ఓ స్త్రీ చేసి చూపించిన తీరు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ముంబై వీధుల్లో సామాన్యుడి గొంతు ఎంత శక్తివంతంగా వినిపిస్తుందో నిరూపించే ఒక సంచలన ఘటన ఇది. ఓ వైపు కేబినెట్ మంత్రి, భారీ జనసందోహం, రక్షణగా పోలీసులు.. కానీ ఆ మహిళలో ఉన్నది తల్లి కోపం, పౌరురాలి ఆవేదన! ఏప్రిల్ 21న ముంబైలోని వోర్లీలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో "సామాన్యుడి యుద్ధం"గా మారుతోంది. కేవలం ఒక నిరసనగా కాకుండా, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనాన్ని ప్రశ్నించే ఒక ధైర్య సాహస గాథగా ఈ ఘటన చరిత్రకెక్కుతోంది.

Mumbai Woman Confronts Minister Girish Mahajan Over Traffic Jam Caused by BJP Rally Viral Video Wins Hearts

ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ నేతృత్వంలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ముంబైలోని జంబోరీ మైదాన్ సమీపంలో 'మహిళా జన ఆక్రోష్' పేరుతో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్న ఒక మహిళ, ఈ ర్యాలీ కారణంగా గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. అప్పటికే రద్దీగా ఉండే రోడ్లను రాజకీయ రచ్చ కోసం వాడుకోవడంతో ఆమె సహనం నశించింది. వెంటనే కారు దిగి, నేరుగా మంత్రి గిరీష్ మహాజన్ మీడియా ముందు మాట్లాడుతున్న వేదిక వద్దకు వెళ్లి ఆయనను నిలదీసింది.

ధైర్యానికి మారుపేరుగా ఆమె పోరాటం..

"తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. మీ ప్రచారాల వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు" అంటూ ఆమె నేరుగా మంత్రిని హెచ్చరించడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. పక్కనే ఖాళీ మైదానం ఉన్నా, రోడ్డుపై ర్యాలీ నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆమె గట్టిగా ప్రశ్నించింది. పోలీసులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, ఏమాత్రం భయం లేకుండా అధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, ప్రజల ఇబ్బందులు తీర్చాలని ఆమె చేసిన డిమాండ్ ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంది.

నెట్టింట వైరల్ - ప్రతిపక్షాలకు ఆయుధంగా..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ క్షణాల్లో వైరల్ అయింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్) వంటి పార్టీలు ఈ వీడియోను షేర్ చేస్తూ అధికార పక్షంపై విమర్శలు గుప్పించాయి. మహిళల పేరుతో ర్యాలీలు చేస్తూ, అదే మహిళలను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై అప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కి ఉండటంతో, ఈ వీడియో దానికి మరింత ఆజ్యం పోసింది.

పౌర సమాజం ప్రశంసలు..

సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతు వెల్లువెత్తుతోంది. "లక్షల మంది పౌరులు రోజువారీ అనుభవించే నరకప్రాయమైన ట్రాఫిక్ సమస్యపై ఆమె ప్రతినిధిగా నిలబడింది" అని కొందరు, "రాజకీయ నాయకులు పాలకులు కాదు, సేవకులు అని ఆమె గుర్తు చేసింది" అని మరికొందరు ప్రశంసించారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న ప్రతి భారతీయుడి తరపున ఆమె ప్రశ్నించిందని, ఇలాంటి గొంతులు మరిన్ని పెరగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే, పోలీసులు, పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉండాలనే వాదనలు వినిపించినప్పటికీ, ఆ క్షణంలో ఆమె చూపిన ధైర్యం మాత్రం ముంబై రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. పౌరులు ఇకపై మూగప్రేక్షకులుగా ఉండరనే సంకేతాన్ని ఈ ఘటన బలంగా పంపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+