ముండే కాలేయం చితికిపోయింది, గుండె ఆగింది

కాలేయం దెబ్బ తినడంతో లోపల రక్తం కారిందని, అకస్మాత్తుగా షాక్‌కి గురి కావడంతో గుండె ఆగిపోయిందని, ముండేకు పెద్దగా దెబ్బలు తగలలేదని, శరీరానికి తగిలిన దెబ్బలు మరణానికి కారణం కాదని నివేదికలో తేలింది.
మెడికల్ బోర్డు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ముండే భౌతిక కాయాన్ని బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, కుటుంబ సభ్యులు అంబులెన్స్ వెంట వెళ్లారు.
మొదటిసారి ముండే కేంద్ర మంత్రివర్గంలో చేరారు. కారులో విమానాశ్రయానికి వెళ్తుండగా ముండే ప్రమాదానికి గురయ్యారు.












Click it and Unblock the Notifications