అర్జున్ రెడ్డి సీన్ రిపీట్.. లవర్‌తో అలా చేశాడని బెస్ట్ ఫ్రెండుని ఎలా చంపాడో తెలుసా?

హర్యానాలోని పానిపట్‌లో ఒక అమానుష హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహం అనే బంధాన్ని మరిచి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేయసికి రంగులు పూశాడనే కోపంతో తన బెస్ట్ ఫ్రెండునే పక్కా పథకంతో అతి కిరాతకంగా చంపడం సర్వత్రా కలకలం రేపుతోంది. అంతే కాకుండా ఈ హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించడానికి కుట్ర పన్నడం మరో కీలక అంశంగా మారింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

హోలీ రోజున అదృశ్యం..

హోలీ పండుగ రోజున 'కాలు' అనే యువకుడు అనుమానాస్పదంగా అదృశ్యమయ్యాడు. కొద్ది గంటల తర్వాత అతని మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. తొలుత ఇది సాధారణ రైలు ప్రమాదమని భావించిన పోలీసులు, కేసును ఆ దిశగా పరిశీలించారు. అయితే తర్వాత వచ్చిన అనుమానాలతో దర్యాప్తు మలుపు తిరిగింది.

murder-case-about-man-kill-his-best-friend-and-trying-to-create-as-accident-for-pouring-colours-on-l

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజం..

Government Railway Police (GRP) దర్యాప్తు ప్రారంభించడంతో ఈ ఘటన వెనుక ఉన్న భయానక కుట్ర బయటపడింది. మృతదేహం పరిస్థితి, గాయాల స్వరూపం, సంఘటన సమయాల్లో ఉన్న అసమానతలు చూసి ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టి మహమూద్‌పూర్‌కు చెందిన సంజు, రాహుల్, విశాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ముగ్గురూ తమ నేరాన్ని అంగీకరించారు. ఈ హత్యకు సంజు ప్రధాన సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. హోలీ రోజున కాలు, సంజు ప్రేయసికి రంగులు పూయడం వల్ల ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఈ సంఘటనను మనసులో పెట్టుకున్న సంజు.. తన స్నేహితుడిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. దాంతో అదే రోజు సంజు తన సహచరులతో కలిసి కాలును బయటకు తీసుకెళ్లి అధిక మోతాదులో మద్యం తాగించాడు. ఆ తర్వాత బైక్‌పై అతడిని రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకెళ్లారు.

స్క్రూడ్రైవర్‌తో దాడి..

ఆ దారి మధ్య లోనే సంజు స్క్రూడ్రైవర్‌తో కాలు మెడపై రెండు సార్లు తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడితో కాలు తీవ్రంగా గాయపడ్డా కానీ ఇంకా ప్రాణాలు కోల్పోలేదు. దీంతో అతడి చేతులు, కాళ్లు కట్టేసి రైల్వే ట్రాక్‌పై పడుకోబెట్టారు. గాయాలు, మద్యం మత్తు కారణంగా కాలు కదలలేని స్థితిలో ఉండిపోయాడు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటికే వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు మొబైల్ లొకేషన్ డేటా, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఘటనకు ముందు, తర్వాత వారి కదలికలను విశ్లేషించి కుట్రను ఛేదించారు. స్నేహితుడినే ఇంత కిరాతకంగా హత్య చేయడం, దానిని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేయడం స్థానిక ప్రజలను షాక్‌కు గురిచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+