జైలు నుంచి తప్పించుకున్నాడు.. చివరకు రైలు కింద పడి..!
యూపీ : జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ, మృత్యువు వెంటాడుతోందనే విషయం గ్రహించలేకపోయాడు. జైలు గోడలు దూకే క్రమంలో ఓ ఖైదీ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇటావా జిల్లా జైలులో ఇద్దరు ఖైదీలు వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే చాలాకాలంగా జైలు నుంచి పారిపోవాలని వారిద్దరు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
ఆ క్రమంలో ఆదివారం నాడు ఇద్దరు ఖైదీలు జైలు గోడలు దూకారు. అందులో ఒకడు పారిపోగా, మరొకడు మాత్రం రైలు పట్టాల మీద పడి ప్రాణాలు కోల్పోయాడు. రమానంద్, చంద్రప్రకాశ్ అనే ఇద్దరు ఖైదీలు మర్డర్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అయితే చంద్రప్రకాశ్ జైలు గోడలు దూకి పారిపోగా.. రమానంద్ మాత్రం ఆ జైలు గోడల పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పైకి దూకాడు. అదే సమయంలో అటుగా రైలు రావడంతో దానికింద పడి చనిపోయాడు.

వారిద్దరూ పారిపోయారనే విషయం జైలు అధికారులకు కూడా చాలాసేపటివరకు తెలియదు. అయితే ఖైదీలను కౌంట్ చేసే సమయంలో ఆ ఇద్దరు మిస్ అయినట్లు గుర్తించారు. అనంతరం రైల్వే పోలీసుల సమాచారం మేరకు రమానంద్ మృతి చెందినట్లు జైలు అధికారులకు తెలిసింది. పరారీలో ఉన్న చంద్రప్రకాశ్ అనే ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications