గంజాయికి బానిస: రూ. 50 ఇవ్వలేదని స్నేహితుడిని వెంటాడి కత్తితో పొడిచి చంపేశాడు!

బెంగళూరు: 50 రూపాయల కోసం స్నేహితుల మధ్య గొడవ జరగడంతో యువకుడు హత్యకు గురైన ఘటన బెంగళూరు నగరంలోని దేవరజీవనహళ్ళి (డీజే హళ్ళి) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీజే హళ్ళిలో నివాసం ఉంటున్న సయ్యద్ వాసీం (19)ను హత్య చేసిన షబీర్ (20) అనే నిందితుడిని డీజే హళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. రూ. 50 ఇవ్వలేదని స్నేహితుడిని వెంటాడి కత్తితో పొడిచి చంపేశాడు.

హత్యకు గురైన సయ్యద్ వాసీం బేకరిలో పని చేసేవాడు. షబీర్ కొయ్య పని (కార్పెంటర్) పని చేస్తున్నాడు, సయ్యద్ వాసీం, షబీర్ స్నేహితులు. షబీర్ గంజాయి సేవించడానికి బానిస అయ్యాడు. మంగళవారం రాత్రి షబీర్ తన స్నేహితుడు సయ్యద్ వాసీం దగ్గరకు వెళ్లాడు.

తాను గంజాయి సేవించడానికి డబ్బులు ఇవ్వాలని షబీర్ చెప్పాడు. తన దగ్గర డబ్బులు లేవని, రేపు ఏమైనా నగదు వస్తే ఇస్తానని సయ్యద్ వాసీం చెప్పాడు. ఆ సమయంలో తనకు ఇప్పుడే డబ్బులు కావాలని షబీర్ స్నేహితుడు సయ్యద్ వాసీంతో గొడవ పడ్డాడు.

Murder for Rs 50 accused arrested near DJ Halli in Bengaluru

విషయం గుర్తించిన స్థానికులు ఇద్దరికీ నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. బుధవారం మద్యాహ్నం 12.30 గంటలకు షబీర్ సయ్యద్ వాసీం దగ్గరకు వెళ్లాడు. తాను రూ. 50 అడిగితే ఇవ్వలేదని, ఇప్పుడు నీ అంతు చూస్తానని జోబులో ఉన్న కత్తి తీసుకుని సయ్యద్ వాసీంను వెంటాడి అతని మీద దాడి చేశాడు.

తీవ్ర కత్తిపొట్లకు గురైన సయ్యద్ వాసీంను ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై మరణించాడని పోలీసులు అన్నారు. బుధవారం అర్దరాత్రి నిర్జనప్రదేశంలో తలదాచుకున్న షబీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి సేవించడానికి బానిస అయిన షబీర్ రూ. 50 ఇవ్వలేదని స్నేహితుడు సయ్యద్ వాసీంను హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+