ఎస్సీ యువతిని బెదిరించిన ముస్లీం యువకుడు ఏం చేశాడంటే, స్కూల్ డేస్ టూ కాలేజ్ డేస్ !
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో 2015 నుండి ఒక ముస్లిం యువకుడు 21 ఏళ్ల షెడ్యూల్డ్ కులానికి చెందిన విద్యార్థినిపై నిరంతరాయంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూడటం కలకలం రేపింది. ఆ యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచి నిందితుడు ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని, చివరికి ఆ యువతిపై అత్యాచారం చేశాడని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.
దీనిపై ఆ యువతి తుమకూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తుమకూరు జిల్లాలోని ఓ గ్రామం నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆ యువతి అక్కడే చదువుకునేందుకు ఉండిపోయింది. ఇదే సమయంలో క్లాస్‌మేట్ సోదరుడితో ఆ యువతికి పరిచయం అయ్యింది. 2015లో ఆ యువతి మైనర్ అని పోలీసులు తెలిపారు. దీన్ని ఆసరాగా తీసుకున్న క్లాస్‌మేట్ అన్నయ్య చాక్లెట్లు ఇస్తానని చెప్పి విద్యార్థి శరీరంలోని అవయవాలను తాకినట్లు ఆరోపణలు వచ్చాయి.

16 ఏళ్ల వయసులో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతుండగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ ముస్లీం యువకుడు బలవంతంగా తన ఇంటిలోకి చొరబడి తన మీద లైంగిక దాడి చేశాడని, తరువాత తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని యువతి ఆరోపించింది. ఆ తర్వాత మళ్లీ విద్యార్థినిని బెదిరించి ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలుపెట్టాడని తెలిసింది. తరువాత రోజూ తన మొబైల్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని యువతి ఆరోపించింది.
ఈ విషయం ఎవరికైనా చెబితే నీ ప్రాణాలు తీస్తానని ఆ ముస్లీం యువకుడు తనను బెదిరించాడని యువతి ఆరోపించింది. ఏప్రిల్ 26వ తేదీన మళ్లీ బలవంతంగా తనను బెదిరించి తన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో నేను ఒప్పుకోకపోవడంతో గొడవ చేశాడని, ఆ సందర్బంగా మా అమ్మ గొడవ విని నాకు సహాయం చేసిందని, తరువాత ఆ ముస్లిం యువకుడు ఇంతకాలం తనను హింసించి లైంగిక దాడికి పాల్పడ్డాడని తన తల్లికి చెప్పానని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమకూరు రూరల్ స్టేషన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆదేశాలతో నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇటీవల హుబ్బళిలో ఓ యువతి మీద లైంగిక దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే హుబ్బళిలో కాలేజ్ అమ్మాయి నేహాను కాలేజ్ క్యాంపస్ లోనే ఓ ముస్లీం యువకుడు దారుణంగా పొడిచి చంపేశాడు.












Click it and Unblock the Notifications