Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bajrang Dal: బస్ స్టాండ్ పక్కనే తల్వార్ తో హిందూ యువకుడిని నరికేశాడు, సీసీటీవీల్లో ?

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలో మరోసారి హిందూ యువకుడి మీద ముస్లీం యువకుడు తల్వార్ తో దాడి చెయ్యడం కలకలం రేపింది. ఇప్పటికే అనేక మంది హిందూ కార్యకర్తలను పీఎఫ్ఐ కార్యకర్తలు హత్య చేశారని కర్ణాటకలోని కొన్ని .జిల్లాల్లో హిందూ సంఘ సంస్థలు రగిలిపోతున్నాయి. శనివారం రాత్రి బెళగావిలో శ్రీరామసేన జిల్లా అధ్యక్షుడు రవి మీద హత్యాయత్నం జరిగింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర పట్టణంలో భజరంగ్ దళ్ కార్యకర్తపై తల్వార్ దాడి చేశారు. ఆ సందర్బంలో బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు.

 బస్ స్టాండ్ సమీపంలో ?

బస్ స్టాండ్ సమీపంలో ?

భజరంగ్ దళ్ కార్యకర్త మీద తల్వార్ తో దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లోరికార్డు అయ్యింది. భజరంగ్ దళ్ కార్యకర్త సునీల్ పై ముస్లిం యువకుడు తల్వార్ తో దాడి చేశాడు. ఆ సందర్బంలో భజరంగ్ దళ్ కార్యకర్త సునీల్ క్షణాల్లో తప్పించుకున్నాడు. సాగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ బస్టాండ్‌ సమీపంలో సునీల్ మీద హత్యాయత్నం జరగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

 భజరంగ్ దళ్ కార్యకర్త

భజరంగ్ దళ్ కార్యకర్త

ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని లాడ్జి దగ్గర సమీర్ అనే ముస్లిం యువకుడు నిలబడి తల్వార్ ఊపుతుండగా బైక్ పై వచ్చిన సునీల్ బైక్ అడ్డగించాడు. ఆ సందర్బంలో సునీల్‌ మీద సమీర్ అనే యువకుడు తల్వార్ తాడి చేశాడు. చంపేస్తారని భయపడిన సునీల్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. శివమొగ్గలో జరిగిన శౌర్య పట సంచలన్ అనే కార్యక్రమంలో సునీల్ పాల్గొన్నాడని, ఆదివారం కూడా కార్యక్రమంలో పాల్గొనడానికి వెలుతున్న సునీల్ మీద పక్కాప్లాన్ తో సమీర్ తల్వార్ తో దాడి చేశాడని తెలిసింది.

 సమీర్ ఇంటిని ముట్టడించిన హిందూ సంఘాలు

సమీర్ ఇంటిని ముట్టడించిన హిందూ సంఘాలు

సాగర్‌లోని నెహ్రూనగర్‌కు చెందిన సమీర్‌ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సునీల్ మీద హత్యాయత్నం చేశాడని వెలుగు చూసింది. సాగర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సునీల్‌పై దాడి నేపథ్యంలో సాగర్‌లోని నెహ్రూనగర్‌లోని నిందితుడు సమీర్ ఇంటి ముందు హిందూ సంఘాల కార్యకర్తలు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సందర్బంలో సమీర్ ఇంట్లో లేడని పోలీసు అధికారులు అంటున్నారు.

 గతంలో ఏం జరిగింది ?

గతంలో ఏం జరిగింది ?

సమీర్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హిందూ సంఘ, సంస్థ కార్యకర్తలను సాగర పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. పాత కక్షల నేపథ్యంలోనే సునీల్ మీద సమీర్ తల్వార్ తో దాడికి పాల్పడ్డాడని సమాచారం. ఇంతకుముందు హిజాబ్ గొడవలో భజరంగ్ దళ్ కార్యకర్త సునీల్ కొందరు ముస్లీం యువకులను కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 రంగంలోకి మూడు టీమ్ లు

రంగంలోకి మూడు టీమ్ లు

సాగర్ జ్యువెలరీ షోరూమ్ సమీపంలోకి వెలుతున్న సునీల్‌ మీద సమీర్ హత్యాయత్నం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. ముందుగా బైక్‌లో తల్వార్ పెట్టుకుని వచ్చిన సమీర్ ఆ ఆయుధం బయటకు తీసి సునీల్ మీద దాడి చేశాడు. ఈ మేరకు మూడు బృందాలను ఏర్పాటు చేసి ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని, కేసు విచారణలో ఉందని శివమొగ్గ జిల్లా ఎస్పీ మిథున్‌కుమార్‌ సోమవారం మీడియాకు చెప్పారు.

 బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు

బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు

భజరంగ్‌దళ్‌ కార్యకర్త సునీల్ పై దాడికి యత్నించిన నేపథ్యంలో సాగర్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట హిందూ అనుకూల సంఘాల నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం సాగర్ బంద్‌కు హిందూ సంఘ, సంస్థలు పిలుపునిచ్చారు. దాడికి యత్నించిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్ తో పా హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద కర్ణాటకలో మరోసారి భజరంగ్ దళ్ కార్యకర్త మీద హత్యాయత్నం జరగడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+