రామాలయం నిర్మాణానికి సహకరించిన ముస్లీంలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రాముడి ఆలయం నిర్మించేందుకు ముస్లీంలు సహకారం అందించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరెనా జిల్లాలో జరిగింది. ఇది హిందూ - ముస్లీం వర్గాల సామరస్యానికి తాజా నిదర్శనం అని చెప్పవచ్చు.
మోరెనా జిల్లాలోని ఖేడకల గ్రామంలో స్థానికులు శ్రీ రామ్ జానకీ ఆలయం నిర్మించాలని భావించారు. ఈ ఆలయానికి గ్రామంలోని ముస్లీంలు తమకు సాధ్యమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారు.

గ్రామంలోని ముస్లీంలు తమకు చెందిన కొంత భూమిని శ్రీ రామ్ జానకి ఆలయం నిర్మించేందుకు ఇచ్చారు. భూమితో పాటు రూ.50వేల నగదును కూడా ఆలయం నిర్మిస్తున్న వారికి అందించారు. రామాలయ నిర్మాణానికి ముస్లీం సోదరులు తమదైన సాయం చేశారని గ్రామ సర్పంచ్ సంత్ కుమార్ సంఘ్ చెప్పారు.












Click it and Unblock the Notifications